చాంద్ హోటల్ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 14/11/2026.
మైలవరం పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన చాంద్ హోటల్ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌ను మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు శనివారం ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకులకు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు శుభాకాంక్షలు తెలియజేశారు. నూతనంగా వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్న ఔత్సాహికులు పట్టుదల, నాణ్యత, నమ్మకంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. వినియోగదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలను పరిశుభ్రమైన వాతావరణంలో అందిస్తూ మంచి పేరు సంపాదించుకోవాలని సూచించారు.
అనంతరం హోటల్ నిర్వాహకులు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, వ్యాపార ప్రముఖులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

