Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రచ్చబండ – కోటి సంతకాల ప్రజా ఉద్యమం ప్రారంభం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రచ్చబండ – కోటి సంతకాల ప్రజా ఉద్యమం ప్రారంభం

వార్త ముఖ్యాంశాలు

  • అక్టోబర్ 16, 2025 ఉదయం 8:00 గంటలకు డాక్టర్ బి.ఆర్.
  • అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని అయినవిల్లి మండలం పొట్టిలంక గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాల ప్రజా కార్యక్రమం జరిగింది.
  • మండల అధ్యక్షులు మేడిశెట్టి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో నిర్వహించిన ఈ రచ్చబండలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం ప్రారంభమైంది.

అక్టోబర్ 16, 2025 ఉదయం 8:00 గంటలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని అయినవిల్లి మండలం పొట్టిలంక గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాల ప్రజా కార్యక్రమం జరిగింది. మండల అధ్యక్షులు మేడిశెట్టి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో నిర్వహించిన ఈ రచ్చబండలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం ప్రారంభమైంది.

ఈ కార్యక్రమంలో పి.గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ శ్రీ గన్నవరపు శ్రీనివాసరావు గారు పాల్గొని, ప్రజలతో కలసి ప్రభుత్వ వైద్య విద్య హక్కును రక్షించాలన్న పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ – వైద్యం మరియు విద్య ప్రతి పౌరుడి మౌలిక హక్కులు కావాలని, వాటిని వ్యాపారంగా మార్చే ప్రయత్నాలను ప్రజా శక్తితో అడ్డుకోవాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, రాష్ట్ర కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, రాష్ట్ర-జిల్లా-నియోజకవర్గ అనుబంధ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు, సమితి కార్యదర్శులు, గ్రామ శాఖ అధ్యక్షులు, తాజా మాజీ ప్రతినిధులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు మరియు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ప్రజలు పెద్ద ఎత్తున హాజరై వైఎస్ఆర్ స్ఫూర్తితో ప్రభుత్వ వైద్య విద్య పరిరక్షణకు మద్దతు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *