Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

తుఫాను తాకిడి – వర్షాలతో శ్రీకాకుళం తడిసి ముద్దయింది – రైతుల ఆందోళన – పెండింగ్‌లో విద్యార్థుల తరగతులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు నుండి వర్షాలు కురుస్తున్నాయి.
  • తీరప్రాంతాల్లో గాలులు వేగంగా వీచడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది.
  • ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు విస్తృతంగా పడుతుండటంతో ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.

తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు నుండి వర్షాలు కురుస్తున్నాయి. తీరప్రాంతాల్లో గాలులు వేగంగా వీచడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు విస్తృతంగా పడుతుండటంతో ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.

వరి పంట కోత దశలో ఉండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో నీరు నిల్వ ఉండటంతో పంటలు నష్టపోవచ్చని భయపడుతున్నారు. మరోవైపు, ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యార్థుల తరగతులు పెండింగ్‌లో ఉండగా, ఆగస్టు నెలలోనూ వర్షాల కారణంగా తరచుగా సెలవులు రావడంతో పాఠ్యపథకం వెనుకబడింది.

వాతావరణ శాఖ వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని హెచ్చరించింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని అధికారులు సూచించారు.


Leave a comment

Your email address will not be published. Required fields are marked *