Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

మీడియా ప్రతి నిధి మీద పెట్టిన కేసులని ఎత్తి వేయాలి : BRS రాష్ట్ర నాయకులు సండ్ర

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మీడియా ప్రతి నిధి మీద పెట్టిన కేసులని ఎత్తి వేయాలి : BRS రాష్ట్ర నాయకులు సండ్ర

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి మీడియా ప్రతినిధిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి.
  • పోలీస్లు ప్రజాస్వామికంగా వ్యవహరించాలి.
  • పోలీస్ కమీషనర్ సునీల్ దత్ కీ వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాత మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఉమ్మడి ఖమ్మం జిల్లా టీ న్యూస్ ప్రతినిధి సాంబశివరావుపై నమోడు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, పోలిస్ వ్యవస్థ…

పున్నమి ప్రతినిధి

మీడియా ప్రతినిధిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి.

పోలీస్లు ప్రజాస్వామికంగా వ్యవహరించాలి.

పోలీస్ కమీషనర్ సునీల్ దత్ కీ వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాత మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య

ఉమ్మడి ఖమ్మం జిల్లా టీ న్యూస్ ప్రతినిధి సాంబశివరావుపై నమోడు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, పోలిస్ వ్యవస్థ ప్రజాస్వామికంగా వ్యవహారంచాలని జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సండ్ర వెంకట వీరయ్య లు పోలిస్ కమీషనర్ సునిల్ దత్ ను కోరారు.

ఈ మేరకు సోమవారం రాత్రి ఖమ్మం నగరంలోని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కొణిజర్లలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్న దృష్యాలను మీడియా ప్రతినిధి తన విధుల్లో భాగంగా వ్యవరిస్తే ఆ విషయా తప్పుదోవ పట్టించి కావాలనే విలేకరులపై తప్పుడు కేసులు నమోదు చేశారన్నారు. వాటిని వెంటనే ఎత్తివేయాలని, మీడియా స్వేచ్ఛను కాపాడాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో సీపీని కలిసిన వారిలో బిఆర్ఎస్. లీ సెల్ బిచ్చాల తిరుమలరావు, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల బిఆర్ఎస్ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, భాషభోయిన వీరన్న, ఉన్నం బ్రహ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *