Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

మానసిక ఆరోగ్య పరిరక్షణ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మానసిక ఆరోగ్య పరిరక్షణ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

మానసిక ఆరోగ్య పరిరక్షణ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
అక్టోబర్ 10, వెలిగండ్ల ( కె టి సి పున్నమి ప్రతినిధి) వెలిగండ్ల మండలం కస్తూరిబా పాఠశాల నందు విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ మానసిక ఆరోగ్యం పై కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జిల్లా కెరీర్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ చెరుకూరి పద్మ ఈ కార్యక్రమంలో విద్యార్థుల సమస్యలు భావోద్వేగాలు భవిష్యత్తు లక్ష్యాలపై అవగాహన కల్పించారు విద్యార్థులు తమ సమస్యలను స్వేచ్ఛగా పంచుకునేలా ప్రోత్సహించి అవసరమైన సహాయ సహకారములు, మార్గదర్శకత్వము అందించారు విద్యార్థి దశలో పిల్లలు ఎల్లప్పుడూ చదువు మీద శ్రద్ధ తీసుకొని మానసికంగా దృఢంగా ఉంటేనే జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనగలమని తెలిపారు సానుకూల ఆలోచనలు మానసిక ధైర్యం మంచి అలవాట్లు విద్యార్థి దశ నుంచే అలవర్చుకోవటం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు విద్యార్థులలో మానసిక ఆరోగ్యం పై అవగాహన పెంచేందుకు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని కస్తూరిబా పాఠశాల స్పెషల్ ఆఫీసర్ మరియు ఉపాధ్యాయులు తెలియపరచడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్ శ్రీమతి ఎస్ సుశీల గారు ఉపాధ్యాయులు సిబ్బంది డి కొండమ్మ గారు సుమిత్ర గారు విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించినందుకు కౌన్సిలర్ పద్మ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

మానసిక ఆరోగ్య పరిరక్షణ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

మానసిక ఆరోగ్య పరిరక్షణ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

మానసిక ఆరోగ్య పరిరక్షణ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *