Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

*మంత్రులుఅనం రామ నారాయణ రెడ్డి. పొంగురు నారాయణ ప్రజలకు జవాబు చెప్పాలి*. మూలాపేటలో సహచరుల సమావేశంలో బిజెపి నేత మిడతల రమేష్ డిమాండ్..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
*మంత్రులుఅనం రామ నారాయణ రెడ్డి. పొంగురు నారాయణ ప్రజలకు జవాబు చెప్పాలి*. మూలాపేటలో సహచరుల సమావేశంలో బిజెపి నేత మిడతల రమేష్ డిమాండ్..

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు మండలాలను తిరుపతిలో ఎందుకు కలి పారు!
  • ఎవరి కోసం నెల్లూరు ను విభజించి నష్టపరుస్తున్నారు.
  • జిల్లాలోని *మంత్రులుఅనం రామ నారాయణ రెడ్డి.

నెల్లూరు మండలాలను తిరుపతిలో ఎందుకు కలి పారు! ఎవరి కోసం నెల్లూరు ను విభజించి నష్టపరుస్తున్నారు.
జిల్లాలోని *మంత్రులుఅనం రామ నారాయణ రెడ్డి. పొంగురు నారాయణ ప్రజలకు జవాబు చెప్పాలి*.
మూలాపేటలో సహచరుల సమావేశంలో బిజెపి నేత మిడతల రమేష్ డిమాండ్..

సోమశిల -కండలేరు ఇంటర్ లింక్ అంతరాష్ట్ర ప్రాజెక్టులు. కండలేరు డ్యాము ను వేరు చేస్తే నీటి నిర్వహణ.రెవెన్యూ నిర్వహణ లలో సమస్యలు తలెత్తుతాయి.
వందల సంవత్సరాలుగా కండలేరు నదిపై ఉన్న *రిపేరియల్ రైట్స్ పొందిన పొదలకూరు మనుబోలు రైతుల హక్కుల హరింపబడతాయి*.
రాపూర్ కలువాయి సైదాపురం లలో ప్రభుత్వ భూములు అటవీ సంపద. సహజ వనరులు. కమర్షియల్ పంటలు అధికం. నెల్లూరు జిల్లా ప్రజలు వాటిని ఎందుకు కోల్పోవాలో మంత్రులు జవాబు చెప్పాలి..
నెల్లూరును రాయలసీమ జోన్ లో కలపడం సమంజసం కాదు. కరువు సమయంలో రాయలసీమ నుండి ఒక్క టీఎంసీ నీరు కూడా సోమశిల అందలేదు. శ్రీశైలం జలాలు పోతిరెడ్డిపాడు నుండి చేసిన 120 టీఎంసీల కేటాయింపులలో ఒక్క టీఎంసీ కూడా నెల్లూరు జిల్లాకు కేటాయించలేదు.
అంతర్రాష్ట్ర ఒప్పందాలను గౌరవించి కండలేరు నుండి కరువు సమయం లోను చెన్నైకి త్రాగునీరు అందించిన మనస్తత్వం కలిగిన వారు నెల్లూరు వారు.
విభజన చేసే మండలాలను నెల్లూరులోనే కలపాలి. నెల్లూరు అమరావతి జోన్ లో కలపాలి.
ఈ సమావేశంలో నరాల సుబ్బారెడ్డి. అల్లూరు నాగేంద్ర సింగ్. నీలిశెట్టి లక్ష్మణరావు. మురగా నరేష్.
జె.శ్రీకృష్ణ. ఆదినారాయణ.. పరిటాల వెంకటకృష్ణ. అరిపినేటి నరసయ్య. రాఘవేంద్ర. చిట్టిబాబు. శ్రీనివాసులు. కళ్ళు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *