Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
News

మర్రిపాడులో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ – 27 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మర్రిపాడులో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ – 27 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

వార్త ముఖ్యాంశాలు

  • మర్రిపాడు, జూలై 31 (పున్నమి ప్రతినిధి): మర్రిపాడు మండల కేంద్రంలోని మిక్స్‌డ్ కాలనీలో పోలీసులు శుక్రవారం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
  • ఆత్మకూరు సీఐ గంగాధర్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్సై బలరాంరెడ్డి, ఆత్మకూరు ఎస్సై జంపాని కుమార్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా మొత్తం 150 ఇళ్లను తనిఖీ చేసి, సరైన పత్రాలు లేని 27 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
  • వాహన యజమానులు అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించిన తర్వాతే వాహనాలను విడుదల చేస్తామని పోలీసులు తెలిపారు.అనంతరం స్థానిక ప్రజలకు మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, మొబైల్ ఫోన్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెల్మెట్ తప్పనిసరిగా ధరించడం, అలాగే అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు…

మర్రిపాడు, జూలై 31 (పున్నమి ప్రతినిధి): మర్రిపాడు మండల కేంద్రంలోని మిక్స్‌డ్ కాలనీలో పోలీసులు శుక్రవారం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆత్మకూరు సీఐ గంగాధర్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్సై బలరాంరెడ్డి, ఆత్మకూరు ఎస్సై జంపాని కుమార్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా మొత్తం 150 ఇళ్లను తనిఖీ చేసి, సరైన పత్రాలు లేని 27 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాహన యజమానులు అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించిన తర్వాతే వాహనాలను విడుదల చేస్తామని పోలీసులు తెలిపారు.అనంతరం స్థానిక ప్రజలకు మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, మొబైల్ ఫోన్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెల్మెట్ తప్పనిసరిగా ధరించడం, అలాగే అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అవగాహన కల్పించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇటువంటి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతాయని పోలీసులు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *