Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు మండలంలో పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మనుబోలు మండలంలో పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 23 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలో అవసరమైన పోలింగ్ స్టేషన్ల వివరాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్నట్లు ఏఈఆర్‌వో జలజాక్షి తెలిపారు.
  • ఆదివారం ఎంపీడీవో కార్యాలయంలో పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ప్రచురించారు.
  • ఈ నెల 23న వివరాలను బహిరంగంగా ప్రకటిస్తామని తెలిపారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 23 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలో అవసరమైన పోలింగ్ స్టేషన్ల వివరాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్నట్లు ఏఈఆర్‌వో జలజాక్షి తెలిపారు. ఆదివారం ఎంపీడీవో కార్యాలయంలో పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ప్రచురించారు. ఈ నెల 23న వివరాలను బహిరంగంగా ప్రకటిస్తామని తెలిపారు. జాబితాపై అభ్యంతరాలు, సవరణలు ఉంటే 26వ తేదీలోగా తెలియజేయాలని సూచించారు. వచ్చిన వినతులను పరిశీలించిన అనంతరం 29వ తేదీ నాటికి కలెక్టర్లు ఆమోదం తెలుపుతారని చెప్పారు. 31వ తేదీన తుది జాబితాను అధికారికంగా వెల్లడిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *