Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం

వార్త ముఖ్యాంశాలు

  • డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రకృతిని ప్రేమిద్దాం..
  • మట్టి వినాయకుడిని పూజిద్దాం అనే నినాదంతో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం నిర్వహించారు.
  • తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రకృతిని ప్రేమిద్దాం.. మట్టి వినాయకుడిని పూజిద్దాం అనే నినాదంతో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం నిర్వహించారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. జనసేన నాయకులు అన్నందేవర మురళి, విత్తనాల రవితేజ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల ప్రాముఖ్యతపై చిన్నారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలువురికి జనసేన పార్టీ సభ్యత్వాలను అందజేశారు. పిఓపి విగ్రహాలు, ప్లాస్టిక్ కవర్ల వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలను వివరించి, చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పర్యావరణహితమైన మట్టి వినాయకులను పూజించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *