Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

మండల విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పాఠశాలల సందర్శనలను పెంచాలని ఆదేశించిన : జిల్లా కలెక్టర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మండల విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పాఠశాలల సందర్శనలను పెంచాలని ఆదేశించిన : జిల్లా కలెక్టర్

వార్త ముఖ్యాంశాలు

  • నకిరేకల్ : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి) ఈరోజు (గురువారం) జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సమీక్ష నిర్వహించారు.
  • ఎంఈఓలు పాఠశాలలను సందర్శించడంతోపాటు,విద్యార్థులలో విద్యాసామర్ధ్యాలు పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
  • పాఠశాలల తనిఖీ తో పాటు,పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, పాఠశాలలకు మంజూరైన పనుల పురోగతి, తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు.

నకిరేకల్ : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి) ఈరోజు (గురువారం) జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సమీక్ష నిర్వహించారు.
ఎంఈఓలు పాఠశాలలను సందర్శించడంతోపాటు,విద్యార్థులలో విద్యాసామర్ధ్యాలు పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. పాఠశాలల తనిఖీ తో పాటు,పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, పాఠశాలలకు మంజూరైన పనుల పురోగతి, తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు.
కొన్ని పాఠశాలలో విద్యాబోధన చాలా బాగుందని, జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలో మంచి విద్యను అందించేందుకు కృషి చేయాలని, వెనుకబడిన పాఠశాలల్లో పురోగతి తీసుకురావాలని అన్నారు. విద్యార్థులను సొంత పిల్లల్లా భావించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారి విద్యాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. తాను పాఠశాల సందర్శన సందర్భంగా ఆయా అంశాలలో విద్యార్థుల విషయపరిజ్ఞానాన్ని పరీక్షించడం జరుగుతున్నదని, అదేవిధంగా ఎంఈఓ లు సైతం పాఠశాలలను సందర్శించి సబ్జెక్టు నాలెడ్జిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *