Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

మండల పార్టీ బలోపేతమే లక్ష్యం: రాష్ట్ర ఖాదీ బోర్డు చైర్మన్ కే.కే. చౌదరి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మండల పార్టీ బలోపేతమే లక్ష్యం: రాష్ట్ర ఖాదీ బోర్డు చైర్మన్ కే.కే. చౌదరి

వార్త ముఖ్యాంశాలు

  • - మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులకు దిశానిర్దేశం - మంగళగిరిలో ఘనంగా 07వ బ్యాచ్ శిక్షణా తరగతులు చిట్వేలు, జనవరి 5 పున్నమి ప్రతినిధి పార్టీకి వెన్నెముకగా నిలిచే మండల స్థాయి నాయకత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శిక్షణా తరగతులు…
  • సోమవారం జరిగిన 07వ బ్యాచ్ నూతన మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల శిక్షణా కార్యక్రమంలో రాష్ట్ర గ్రామీణ పరిశ్రమల (ఖాదీ బోర్డు) చైర్మన్ కే.కే.
  • చౌదరి ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు.

– మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులకు దిశానిర్దేశం

– మంగళగిరిలో ఘనంగా 07వ బ్యాచ్ శిక్షణా తరగతులు

చిట్వేలు, జనవరి 5 పున్నమి ప్రతినిధి

పార్టీకి వెన్నెముకగా నిలిచే మండల స్థాయి నాయకత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శిక్షణా తరగతులు నిర్వహించారు. సోమవారం జరిగిన 07వ బ్యాచ్ నూతన మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల శిక్షణా కార్యక్రమంలో రాష్ట్ర గ్రామీణ పరిశ్రమల (ఖాదీ బోర్డు) చైర్మన్ కే.కే. చౌదరి ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు.

-అధ్యక్షుల విధులు – విధానాలపై అవగాహన

“మండల పార్టీ అధ్యక్షుల విధులు – విధానాలు” అనే అంశంపై కే.కే. చౌదరి నాయకులకు సమగ్రంగా అవగాహన కల్పించారు. మండల స్థాయిలో పార్టీని ఎలా బలోపేతం చేయాలి, కార్యకర్తలను ఎలా సమన్వయం చేసుకోవాలి అనే విషయాలపై ఆయన దిశానిర్దేశం చేశారు.

-ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ఈ సందర్భంగా కే.కే. చౌదరి మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడంలో మండల స్థాయి నాయకుల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు.
పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని ఆయన సూచించారు.కేడర్‌ను సమన్వయం చేసుకుంటూ, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను గ్రామస్థాయిలో చర్చకు తీసుకురావాలని పిలుపునిచ్చారు.

-నాయకుల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం

ఈ శిక్షణా తరగతులు తమలో కొత్త ఉత్సాహాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని నింపాయని శిక్షణ పొందిన నాయకులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు కార్యాచరణకు ఈ తరగతులు ఒక దిశానిర్దేశంలా ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మరియు సీనియర్ నేతలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *