భూ రీ సర్వే పనులను పరిశీలించిన తహసీల్దార్ కృష్ణవేణి
రైతులకు భూ రికార్డుల్లో స్పష్టత కల్పించడమే లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూ రీ సర్వే కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న సర్వే పనులను తహసీల్దార్ (ఎమ్మార్వో) కృష్ణవేణి గారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా భూ రీ సర్వే పనుల పురోగతిని సమీక్షించి, సర్వే ప్రక్రియకు సంబంధించిన వివరాలను అధికారులను, లైసెన్స్ సర్వేయర్లను అడిగి తెలుసుకున్నారు.
భూ రీ సర్వే ద్వారా భూముల హద్దులు, విస్తీర్ణం, భూ రికార్డులకు సంబంధించిన వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రికార్డుల్లో స్పష్టత తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సర్వే నిర్వహించే సమయంలో రైతుల సహకారం ఎంతో అవసరమని, భూములకు సంబంధించిన పత్రాలు, వివరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జీపీఓ రమేష్ గారు, లైసెన్స్ సర్వేయర్లు బుక్కా రాము, బాధావతి శివ, రైతులు తదితరులు పాల్గొన్నారు. భూ రీ సర్వే పనులను సమన్వయంతో నిర్వహిస్తూ, రైతులకు సంబంధించిన భూ వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
