Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబాబాద్

పసిపాపపై అఘాయిత్యం.. తల్లి నిరాకరణతో కక్ష పెంచుకున్న నిందితుడు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పసిపాపపై అఘాయిత్యం.. తల్లి నిరాకరణతో కక్ష పెంచుకున్న నిందితుడు

వార్త ముఖ్యాంశాలు

  • వివాహేతర సంబంధానికి ఒప్పుకోలేదని దారుణం..
  • రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసిన వ్యక్తి అరెస్ట్భ బారూచ్ (గుజరాత్), నవంబర్ 26: గుజరాత్‌లోని భరూచ్ జిల్లా దహేజ్ ప్రాంతంలో అత్యంత అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది.
  • తనతో వివాహేతర సంబంధం కొనసాగించేందుకు ఓ మహిళ నిరాకరించిందనే కక్షతో, ఆమె రెండేళ్ల కుమార్తెపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.

వివాహేతర సంబంధానికి ఒప్పుకోలేదని దారుణం.. రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసిన వ్యక్తి అరెస్ట్భ
బారూచ్ (గుజరాత్), నవంబర్ 26: గుజరాత్‌లోని భరూచ్ జిల్లా దహేజ్ ప్రాంతంలో అత్యంత అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. తనతో వివాహేతర సంబంధం కొనసాగించేందుకు ఓ మహిళ నిరాకరించిందనే కక్షతో, ఆమె రెండేళ్ల కుమార్తెపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. చిన్నారిని లక్ష్యంగా చేసుకుని నిందితుడు చేసిన దారుణం స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.
తల్లి నిరాకరణతో వేధింపులు, బెదిరింపులు
పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడు సురేంద్రకుమార్ (28) బాధిత చిన్నారి తండ్రికి పరిచయస్తుడు. కొంతకాలంగా చిన్నారి తల్లిని వివాహేతర సంబంధం కొనసాగించాలని వేధిస్తున్నట్లు సమాచారం. ఆమె అందుకు నిరాకరించడంతో నిందితుడు ఆగ్రహానికి గురై ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది.
చాక్లెట్ల ఆశ చూపించి చిన్నారిని తీసుకెళ్లి..
ఇంటివద్ద ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారికి చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపించి తన గదిలోకి తీసుకెళ్లిన నిందితుడు, అక్కడ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఘటనలో చిన్నారికి గాయాలైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
పోక్సో చట్టం కింద కేసు.. నిందితుడి అరెస్ట్
చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి ప్రత్యేక పోక్సో కోర్టులో హాజరుపరిచారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

పున్నమి రిపోర్టర్ | భూక్య రాము నాయక్ |
మరిపెడ బంగ్లా, మహబూబాబాద్ జిల్లా

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *