Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

భగత్ సింగ్ ఆశయాలను సాధిద్దాం షహీద్ భగత్ సింగ్ వర్ధంతి NSUI నాయకులు కోట దుర్గరాజు ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ ఆవరణంలో ఘననివాళి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
భగత్ సింగ్ ఆశయాలను సాధిద్దాం షహీద్ భగత్ సింగ్ వర్ధంతి NSUI నాయకులు కోట దుర్గరాజు ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ ఆవరణంలో ఘననివాళి

*భగత్ సింగ్ ఆశయాలను సాధిద్దాం*

పున్నమి న్యూస్ ప్రతినిధి
తెలంగాణ ఇంచార్జ్
23 మార్చి 2026

షహీద్ భగత్ సింగ్ , రాజు గురు, సుఖదేవ్ ల వర్ధంతి NSUI నాయకులు కోట దుర్గరాజు ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ ఆవరణంలో నివాళి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భగత్ సింగ్ బ్రిటిష్ సామ్రాజ్యావానికి వ్యతిరేకంగా స్వేచ్ఛ కోసం స్వాతంత్రం కోసం బ్రిటిష్ పరిపాలన నుండి విముక్తి కోసం రాజీలేని పోరాటాలను కొనసాగించి వీరమరణం పొందారు• సోషలిస్ట్ లౌకికవాదం తో కూడిన ఉద్యమాలను ఎలాంటి మత విశ్వాసాలకు దూరంగా తన జీవితాన్ని కొనసాగించారు .!బ్రిటిష్ సామ్రాజ్యవాదంనశించాలివిప్లవం వర్ధిల్లాలి !అనే నినాదంతో అదే తమ పవిత్రాశయంగా అత్యున్నత రాజకీయ విశ్వసంగా ప్రకటిస్తూ తుది శ్వాస విడిచారు .1928 ఢిల్లీ కేంద్రంగా రెండు రోజులు సమావేశాలు నిర్వహించి,సోషలిస్ట్ అనే పదానికి లౌకిక దృక్పథానికి ప్రణాళికలో మౌలికమైన మార్పుకు ఆమోదం పొందేటట్లు చేయడంలో భగత్ సింగ్ పాత్ర కీలకం.ఆనాడే భగత్ సింగ్ తాము కోరుకుంటున్న స్వాతంత్రం కొద్ది మంది సంపన్నుల కోసం కాదని కోట్లాది శ్రమజీవుల కోసమని ప్రజలకు సూటిగా అర్థమయ్యేలా చెప్పారు.నేటి పాలకవర్గాలు నోటితో పొగుడుతూ ఆచరణలోఆయన బోధించిన లౌకిక వాదాన్ని సోషల్టి సమాజాన్ని నోసటితో వెక్కిరిస్తున్నారు .కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం భగత్ సింగ్ ఆశయాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ వస్తున్నాయి .పాఠ్యాంశాల్లో భగత్ సింగ్ చరిత్రను కూడా తొలగించారు. భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకపోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉన్నది , భగత్ సింగ్ కోరుకున్న భావజాలాన్ని దేశం నలుమూలలకు వ్యాపింప చేయాలి. ఫ్యాక్టరీలు,కార్ఖానాలు,మురికి వాడలు,గ్రామాల్లో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పూరి గుడిసెల్లో నివసిస్తున్న కోట్లాది ప్రజానీకాన్ని పాఠశాల, కళాశాల,విశ్వవిద్యాలయాల విద్యార్థులను పోరాటాలలో భాగస్వామ్యం చేయాలని కోరుతున్నాం.
ఇంక్విలాబ్ జిందాబాద్
ఈ కార్యక్రమంలో NSUI నాయకులు శ్రీధర్ , టి ఎస్ ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ ఎం శ్రీకాంత్ యాదవ్, AMSA ఓయూ అధ్యక్షులు నామ సైదులు రాష్ట్ర అధ్యక్షుడు విజయ నాయక్ , NSUI నాయకులు, మహేందర్, రుద్రాక్ష, సాయి, రమేష్ ,విశాల్,
నాయకులు పాల్గొన్నారు.
ఉద్యమాభివందనాలతో
కోట దుర్గరాజు
NSUI నాయకులు

భగత్ సింగ్ ఆశయాలను సాధిద్దాం షహీద్ భగత్ సింగ్ వర్ధంతి NSUI నాయకులు కోట దుర్గరాజు ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ ఆవరణంలో ఘననివాళి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *