వార్త ముఖ్యాంశాలు
- దుత్తలూరు: మండలంలోని బ్రహ్మేశ్వరం వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
- రోడ్డుపైకి బర్రెలు రావడంతో అదుపుతప్పిన కారు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది.
- ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన నాయుడు, ఆయన కుమారుడు పవన్ తీవ్రంగా గాయపడ్డారు.
దుత్తలూరు: మండలంలోని బ్రహ్మేశ్వరం వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపైకి బర్రెలు రావడంతో అదుపుతప్పిన కారు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన నాయుడు, ఆయన కుమారుడు పవన్ తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళ్తున్న టీడీపీ మండల మాజీ కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు, ఎస్సై మహేంద్రకు సమాచారం అందించారు. అనంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.