ఖమ్మం
దేశవ్యాప్తంగా సోమవారం నుంచి మూడు రోజుల పాటు చేపట్టాల్సిన బ్యాంక్ ఉద్యోగుల సమ్మె వాయిదా పడింది. ఈ నెల 28, 29, 30 తేదీల్లో సమ్మె నిర్వహించేందుకు ఉద్యోగ సంఘాలు శంఖారావం పూరించాయి. అయితే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) మధ్య కీలక అంశాలపై అవగాహన కుదరడంతో సమ్మెను వాయిదా వేసినట్లు ఖమ్మం నగరంలోని బ్యాంక్ అధికారులు తెలిపారు. దీంతో సోమవారం నుంచి బ్యాంకుల కార్యకలాపాలు సాధారణంగా కొనసాగనున్నాయి. సమ్మె వాయిదా విషయాన్ని ఖాతాదారులు, ప్రజలు గమనించాలని బ్యాంక్ అధికారులు కోరారు. మూడు రోజుల సమ్మె కారణంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలుగుతుందని భావించిన వినియోగదారులకు తాజా నిర్ణయం ఉపశమనంగా మారింది.
