Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

బ్యాంకు క్యూలు వద్దు.. పింఛన్లు ఇంటివద్దే ఇవ్వాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
బ్యాంకు క్యూలు వద్దు.. పింఛన్లు ఇంటివద్దే ఇవ్వాలి

వార్త ముఖ్యాంశాలు

  • - బ్యాంకుల వద్ద వృద్ధులు, వికలాంగులకు ఇబ్బందులు అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చిట్వేల్, సెప్టెంబర్ 26: పింఛన్ల నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానాన్ని విరమించి, గతంలో మాదిరిగా మొత్తం పింఛన్ సొమ్మును ఒకేసారి లబ్ధిదారుల ఇంటివద్దే అందించాలని ఏపీ వికలాంగులు, పింఛన్‌దారుల…
  • ఆంధ్రయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
  • పింఛన్ సొమ్మును రెండు భాగాలుగా ఇవ్వడం వల్ల లబ్ధిదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

– బ్యాంకుల వద్ద వృద్ధులు, వికలాంగులకు ఇబ్బందులు
అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్

చిట్వేల్, సెప్టెంబర్ 26: పింఛన్ల నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానాన్ని విరమించి, గతంలో మాదిరిగా మొత్తం పింఛన్ సొమ్మును ఒకేసారి లబ్ధిదారుల ఇంటివద్దే అందించాలని ఏపీ వికలాంగులు, పింఛన్‌దారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.ఎన్. ఆంధ్రయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పింఛన్ సొమ్మును రెండు భాగాలుగా ఇవ్వడం వల్ల లబ్ధిదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా వికలాంగులు, వృద్ధులు బ్యాంకుల వద్ద క్యూలో నిలబడలేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కొత్త పింఛన్ల కోసం అర్హులైన వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, డయాలసిస్ బాధితుల పేర్లను పరిశీలించి మంజూరు చేయాలని కోరారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో అనర్హుల పేర్లు నమోదైనట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని పరిశీలించి అర్హులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో సంఘం నాయకులు, వికలాంగులు, వృద్ధులు, పింఛన్‌దారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *