Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బోగోలు మండలంలో మూడు ఎంపీటీసీ స్థానాలు కూటమి ఏకగ్రీవం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బోగోలు మండలంలో మూడు ఎంపీటీసీ స్థానాలు కూటమి ఏకగ్రీవం

పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

బోగోలు మండలంలో మూడు ఎంపీటీసీ స్థానాల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బోగోలు బిట్‌–1, బోగోలు బిట్‌–2, సీ.ఆర్‌.పాలెం ఎంపీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో కూటమి నాయకులు, కార్యకర్తల్లో ఆనందం వ్యక్తం చేశారు

బోగోలు బిట్‌–1లో పందిపాటి మనోహర్ ఏకగ్రీవం

బోగోలు బిట్‌–1 ఎంపీటీసీ స్థానానికి కూటమి అభ్యర్థి పందిపాటి మనోహర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానంలో నామినేషన్లు దాఖలు చేసిన మేకల సాల్మన్ రాజు, చల్లా జోషి తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో పందిపాటి మనోహర్ ఏకగ్రీవ ఎన్నికకు మార్గం సుగమమైంది.

బోగోలు బిట్‌–2లో పులి వెంకటస్వామి ఏకగ్రీవం

బోగోలు బిట్‌–2 ఎంపీటీసీ స్థానానికి కూటమి అభ్యర్థి పులి వెంకటస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానంలో నామినేషన్లు దాఖలు చేసిన మదిబోయిన వీర రఘు, ఆయన కుమార్తెతో పాటు మరో మహిళ తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో పులి వెంకటస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

సీ.ఆర్‌.పాలెంలో ఆవుల రాములమ్మ ఏకగ్రీవం

సీ.ఆర్‌.పాలెం ఎంపీటీసీ స్థానానికి కూటమి అభ్యర్థి ఆవుల రాములమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బడుగు వెంకయ్య తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఆవుల రాములమ్మ ఏకగ్రీవ ఎన్నికకు మార్గం సుగమమైంది.

బోగోలు మండలంలో మూడు ఎంపీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో కూటమి శ్రేణుల్లో హర్షం వ్యక్తమైంది. గ్రామాల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు.

బోగోలు మండలంలో మూడు ఎంపీటీసీ స్థానాలు కూటమి ఏకగ్రీవం

బోగోలు మండలంలో మూడు ఎంపీటీసీ స్థానాలు కూటమి ఏకగ్రీవం

బోగోలు మండలంలో మూడు ఎంపీటీసీ స్థానాలు కూటమి ఏకగ్రీవం

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *