Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

బెస్ట్ అవైలబుల్ స్కూల్ లో ప్రవేశం కొరకు దరఖాస్తుల ఆహ్వానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బెస్ట్ అవైలబుల్ స్కూల్ లో ప్రవేశం కొరకు దరఖాస్తుల ఆహ్వానం

వార్త ముఖ్యాంశాలు

  • బెస్ట్ అవైలబుల్ స్కూల్ లో ప్రవేశం కొరకు దరఖాస్తుల ఆహ్వానం *_పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష_* పెద్దపల్లి, జులై 17, పున్నమి ప్రతినిధి: 2025-26 సంవత్సరానికి గాను బెస్ట్ అవైలబుల్ స్కూల్ లో 3వ, 5వ, తరగతుల్లో ప్రవేశం కొరకు పెద్దపల్లి జిల్లాలోని గిరిజన…
  • బెస్ట్ అవైలబుల్ స్కూల్ నందు జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థినీ, విద్యార్థులకు మొత్తము (5) సీట్లు కేటాయించడం జరిగిందని , వీటిలో 3 సీట్లు లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయబడ్డాయని తెలిపారు.

బెస్ట్ అవైలబుల్ స్కూల్ లో ప్రవేశం కొరకు దరఖాస్తుల ఆహ్వానం

*_పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష_*

పెద్దపల్లి, జులై 17, పున్నమి ప్రతినిధి: 2025-26 సంవత్సరానికి గాను బెస్ట్ అవైలబుల్ స్కూల్ లో 3వ, 5వ, తరగతుల్లో ప్రవేశం కొరకు పెద్దపల్లి జిల్లాలోని గిరిజన విద్యార్థినీ, విద్యార్థులు జూలై 26 లోగా దరఖాస్తులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ నందు జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థినీ, విద్యార్థులకు మొత్తము (5) సీట్లు కేటాయించడం జరిగిందని , వీటిలో 3 సీట్లు లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయబడ్డాయని తెలిపారు.

మూడవ తరగతిలో ఎరుకుల బాలురకు ఒకటి, ఐదవ తరగతిలో గోండు నాయక్ బాలురకు ఒక సీట్ పెండింగ్ ఉందని వీటికోసం ప్రస్తుతం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

తల్లిదండ్రుల వార్షిక ఆదాయం అర్బన్ ప్రాంతంలో రెండు లక్షలు, రూరల్ ప్రాంతంలో ఒక లక్షా 50 వేలు ఉండాలని, ధ్రువీకరణ పత్రాలు ఆదాయం, కులం, బర్త్, స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ 2 సైజ్ ఫోటోలను జత చేసి పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 26 లోగా కరీంనగర్ జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని, ఇతర వివరాలకు ఫోన్ నెంబరు 9652118867 నందు సంప్రదించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *