Monday, 28 September 2026
  • Home  
  • బెదిరింపుల వల్లే అప్పట్లో రామకృష్ణారెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేశా
- తూర్పు గోదావరి

బెదిరింపుల వల్లే అప్పట్లో రామకృష్ణారెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేశా

నెల్లిమర్ల శ్రీనివాసరావు వెల్లడి.. ఎమ్మెల్యేకు క్షమాపణలు అనపర్తి, సెప్టెంబరు 28 (పున్నమి ప్రతినిధి): అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై గతంలో తాను చేసిన ఆరోపణలు వాస్తవాలు తెలియక, అప్పటి కొందరు వైఎస్సార్‌సీపీ నాయకుల ఒత్తిడి, బెదిరింపుల కారణంగానే చేశానని కుతుకులూరుకు చెందిన నెల్లిమర్ల శ్రీనివాసరావు తెలిపారు. దొంతమూరు గ్రావెల్ క్వారీ వ్యవహారంలో ఎమ్మెల్యేకు రూ.18 లక్షలు ఇచ్చామని తాను గతంలో చెప్పినప్పటికీ, ఆ డబ్బులు ఇచ్చిన విషయం తనకు వ్యక్తిగతంగా తెలియదని స్పష్టం చేశారు. తనకు ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయాలని కొందరు ఒత్తిడి చేశారని, తొలుత తాను నిరాకరించినప్పటికీ తనపై కేసులు పెడతామని, జైలుకు పంపుతామని బెదిరించడంతో చివరకు ఆ స్క్రిప్ట్‌ను చెప్పాల్సి వచ్చిందని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ విషయంలో తనకు పూర్తి వాస్తవాలు తెలియవని, గతంలో చేసిన ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. తన వల్ల జరిగిన ఇబ్బందులకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తనను క్షమించాలని శ్రీనివాసరావు కోరారు. తాను గతంలో మాట్లాడిన వీడియోను డాక్టర్ సూర్యనారాయణరెడ్డి పదేపదే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ, తన కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పాత వీడియోను తిరిగి వైరల్ చేయకుండా తనను ఇబ్బందులకు గురిచేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

నెల్లిమర్ల శ్రీనివాసరావు వెల్లడి.. ఎమ్మెల్యేకు క్షమాపణలు

అనపర్తి, సెప్టెంబరు 28 (పున్నమి ప్రతినిధి): అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై గతంలో తాను చేసిన ఆరోపణలు వాస్తవాలు తెలియక, అప్పటి కొందరు వైఎస్సార్‌సీపీ నాయకుల ఒత్తిడి, బెదిరింపుల కారణంగానే చేశానని కుతుకులూరుకు చెందిన నెల్లిమర్ల శ్రీనివాసరావు తెలిపారు. దొంతమూరు గ్రావెల్ క్వారీ వ్యవహారంలో ఎమ్మెల్యేకు రూ.18 లక్షలు ఇచ్చామని తాను గతంలో చెప్పినప్పటికీ, ఆ డబ్బులు ఇచ్చిన విషయం తనకు వ్యక్తిగతంగా తెలియదని స్పష్టం చేశారు.

తనకు ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయాలని కొందరు ఒత్తిడి చేశారని, తొలుత తాను నిరాకరించినప్పటికీ తనపై కేసులు పెడతామని, జైలుకు పంపుతామని బెదిరించడంతో చివరకు ఆ స్క్రిప్ట్‌ను చెప్పాల్సి వచ్చిందని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ విషయంలో తనకు పూర్తి వాస్తవాలు తెలియవని, గతంలో చేసిన ఆరోపణలు అవాస్తవమని తెలిపారు.

తన వల్ల జరిగిన ఇబ్బందులకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తనను క్షమించాలని శ్రీనివాసరావు కోరారు. తాను గతంలో మాట్లాడిన వీడియోను డాక్టర్ సూర్యనారాయణరెడ్డి పదేపదే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ, తన కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పాత వీడియోను తిరిగి వైరల్ చేయకుండా తనను ఇబ్బందులకు గురిచేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.