Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

బుద్ధుని కర్మ సిద్ధాంతం ఆచరణీయమైనది

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బుద్ధుని కర్మ సిద్ధాంతం ఆచరణీయమైనది

బీఎస్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ గడపాలే

ముధోల్, ఆగస్టు 2(పున్నమి ప్రతినిధి ):ప్రపంచానికి శాంతి అహింసాయుత మార్గాన్ని చూపిన గౌతమ బుద్ధుని కర్మ సిద్ధాంతం ఆచరణియమైనదని భారతీయ బౌద్ధమహసభ రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ గడపాలే అన్నారు మండల కేంద్రమైన ముధోల్ పట్టణంలోని నాగార్జున నగర్‌లో గల జేతవన్ బుద్ధవిహార్‌లో భారతీయ బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం వర్షావాస్ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమ బుద్ధుడు, భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి దీప పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ తథాగత గౌతమ బుద్ధుడు బోధించిన కర్మ సిద్ధాంతం మానవ జీవితానికి మార్గదర్శకమని అన్నారు. ప్రతి వ్యక్తి చేసే కర్మలకు తగిన ఫలితాలు ఉంటాయని మంచి ఆలోచనలు మంచి మాటలు, మంచి పనులతో జీవితం సార్థకం అవుతుందని పేర్కొన్నారు. మనిషి తన ఆలోచనలు మాటలు చేతలపై నియంత్రణ కలిగి ఉండాలని సత్కర్మల ద్వారా సమాజంలో శాంతి, సామరస్యాన్ని పెంపొందించాలని సూచించారు. ద్వేషం, అసూయ, హింస వంటి చెడు భావాలకు దూరంగా ఉండి ప్రేమ, కరుణ, మైత్రి, సమానత్వం వంటి బౌద్ధ విలువలను ఆచరించాలని పిలుపునిచ్చారు. బుద్ధుడు చూపిన మార్గం సమస్త మానవాళి శ్రేయస్సును కోరుకునే జీవన విధానమని తెలిపారు. బుద్ధుని బోధనలను రోజువారీ జీవితంలో ఆచరించడం ద్వారా వ్యక్తిగతంగా ప్రశాంతతతో పాటు సమాజంలో సౌభ్రాతృత్వం నెలకొంటుందని అన్నారు. వర్షావాస్ కార్యక్రమం సందర్భంగా బుద్ధుని బోధనలపై ప్రత్యేక ప్రవచనం నిర్వహించారు. బౌద్ధ అనుచరులు బుద్ధవందన, ధమ్మవందన కార్యక్రమాల్లో పాల్గొని శాంతి, సామరస్యం, సమాజ శ్రేయస్సు కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షుడు రమేష్ బాబు వాగ్మారే, ఎస్ఎస్డి ఉత్తర తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ వాగ్మారే, అప్పారావు వాగ్మరే, భోగాజితంగానే, మహిళలు, యువకులు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.

బుద్ధుని కర్మ సిద్ధాంతం ఆచరణీయమైనది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *