Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

ఉపసర్పంచ్‌ల ఫోరం జిల్లా కార్యదర్శిగా జాదవ్ అంబర్‌సింగ్ నాయక్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉపసర్పంచ్‌ల ఫోరం జిల్లా కార్యదర్శిగా జాదవ్ అంబర్‌సింగ్ నాయక్

ముధోల్, ఆగస్టు 3(పున్నమి ప్రతినిధి):ఉపసర్పంచ్‌ల ఫోరం జిల్లా కార్యదర్శిగా ముథోల్ మండలంలోని ఎడ్బీడ్ తండా ఉపసర్పంచ్ జాదవ్ అంబర్‌సింగ్ నాయక్ ఎన్నికైనట్లు ఉపసర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు పొద్దుటూరి సంపత్‌రెడ్డి తెలిపారు. జాదవ్ అంబర్‌సింగ్ నాయక్ ను జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ ఫోరం రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. తనపై నమ్మకంతో జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన ఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బోట్ల కార్తీక్‌కు, జిల్లా అధ్యక్షుడు పొద్దుటూరి సంపత్‌రెడ్డికి జాదవ్ అంబర్‌సింగ్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. ఉపసర్పంచ్‌ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడంతో పాటు ఫోరం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉపసర్పంచ్‌ల హక్కులు, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఉపసర్పంచ్‌ల ఫోరం జిల్లా కార్యదర్శిగా జాదవ్ అంబర్‌సింగ్ నాయక్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *