వార్త ముఖ్యాంశాలు
- ఆదివారం అమరావతి గ్రౌండ్స్‌లో భేటీ పామూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఆదివారం సమావేశం నిర్వహించనున్నారు.
- తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో బీసీ వర్గాల రాజకీయ అభ్యున్నతికి సంబంధించి చేపడుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు టీడీపీ పామూరు మండల అధ్యక్షుడు బొల్లా నరసింహారావు తెలిపారు.
- ఆదివారం ఉదయం 10 గంటలకు అమరావతి గ్రౌండ్స్‌లో జరిగే ఈ సమావేశానికి ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఆదివారం అమరావతి గ్రౌండ్స్‌లో భేటీ
పామూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఆదివారం సమావేశం నిర్వహించనున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో బీసీ వర్గాల రాజకీయ అభ్యున్నతికి సంబంధించి చేపడుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు టీడీపీ పామూరు మండల అధ్యక్షుడు బొల్లా నరసింహారావు తెలిపారు.
ఆదివారం ఉదయం 10 గంటలకు అమరావతి గ్రౌండ్స్‌లో జరిగే ఈ సమావేశానికి ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సమావేశానికి బీసీ సెల్ ముఖ్య నాయకులు, మండల స్థాయి ముఖ్య నాయకులు తప్పనిసరిగా హాజరుకావాలని బొల్లా నరసింహారావు కోరారు.