Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

బీసీలంతా ఐక్యతతో ఉంటే అండగా ఉంటాం: ఎమ్మెల్యే నల్లమిల్లి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
బీసీలంతా ఐక్యతతో ఉంటే అండగా ఉంటాం: ఎమ్మెల్యే నల్లమిల్లి

వార్త ముఖ్యాంశాలు

  • రంగంపేట, సెప్టెంబరు 28 (పున్నమి ప్రతినిధి): బీసీలంతా ఐక్యంగా ఉంటే వారి అభ్యున్నతి, సంక్షేమం కోసం తాము అండగా నిలుస్తామని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.
  • రంగంపేటలో బీసీలకు కోటి రూపాయల విలువైన స్థలం అందించేందుకు ప్రయత్నిస్తుంటే అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
  • బీసీ సంక్షేమం కోసం జరుగుతున్న కార్యక్రమాలకు సంఘీభావం తెలిపి, సమస్యలపై ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు.

రంగంపేట, సెప్టెంబరు 28 (పున్నమి ప్రతినిధి): బీసీలంతా ఐక్యంగా ఉంటే వారి అభ్యున్నతి, సంక్షేమం కోసం తాము అండగా నిలుస్తామని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. రంగంపేటలో బీసీలకు కోటి రూపాయల విలువైన స్థలం అందించేందుకు ప్రయత్నిస్తుంటే అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బీసీ సంక్షేమం కోసం జరుగుతున్న కార్యక్రమాలకు సంఘీభావం తెలిపి, సమస్యలపై ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. సభలు, సమావేశాలు వ్యక్తుల కోసం కాకుండా సంఘం ప్రయోజనాల కోసం నిర్వహించాలని సూచించారు. నియోజకవర్గంలోని పులగుర్త, పెదపూడి, వడిసలేరు, ఎస్టీ రాజాపురం చేనేత క్లస్టర్లకు నిధులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. బీసీల హక్కులు, అభ్యున్నతి కోసం అందరూ ఐక్యతతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *