Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో ద్రాక్షారామలో పౌష్టికాహార వారోత్సవ కార్యక్రమం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో ద్రాక్షారామలో పౌష్టికాహార వారోత్సవ కార్యక్రమం

వార్త ముఖ్యాంశాలు

  • డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ గ్రామంలో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో పౌష్టికాహార వారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
  • ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన భీమాబాయి మహిళా మండలి హెల్త్ ప్రోగ్రాం ఆర్గనైజర్ జి చంద్రకళ మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు గల ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.
  • ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఎన్ఎం రాజేశ్వరి మాట్లాడుతూ ఆహారపరమైన క్రమశిక్షణ పాటించడం ద్వారానే ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించవచ్చునన్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ గ్రామంలో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో పౌష్టికాహార వారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన భీమాబాయి మహిళా మండలి హెల్త్ ప్రోగ్రాం ఆర్గనైజర్ జి చంద్రకళ మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు గల ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఎన్ఎం రాజేశ్వరి మాట్లాడుతూ ఆహారపరమైన క్రమశిక్షణ పాటించడం ద్వారానే ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించవచ్చునన్నారు. అంగన్వాడీ కార్యకర్త సత్యవేణి మాట్లాడుతూ ఆకుకూరలు, కాయగూరలు, పండ్లలో గల పోషక విలువలను గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో భీమాబాయి మహిళా మండలి కమ్యూనిటీ ఆర్గనైజర్ సత్యనారాయణమ్మ,ప్రాజెక్టు పరిధిలోని మహిళలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *