Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో కరపలో పౌష్టికాహార వారోత్సవ కార్యక్రమాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో కరపలో పౌష్టికాహార వారోత్సవ కార్యక్రమాలు

వార్త ముఖ్యాంశాలు

  • కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కరపలో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో పౌష్టికాహార వారోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు.
  • ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీమాబాయి మహిళా మండలి హెల్త్ ప్రోగ్రాం ఆర్గనైజర్ జి చంద్రకళ మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు లభించే ఆకుకూరలు, కాయగూరలు,పండ్లు వినియోగించడం ద్వారా రోగాలకు దూరం కావచ్చును అన్నారు.
  • ఈ సందర్భంగా ఆకుకూరలు,కాయగూరలు, పండ్ల ద్వారా లభించే పోషకాలను వివరించి వాటి ప్రాముఖ్యతను తెలియజేశారు.

కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కరపలో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో పౌష్టికాహార వారోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీమాబాయి మహిళా మండలి హెల్త్ ప్రోగ్రాం ఆర్గనైజర్ జి చంద్రకళ మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు లభించే ఆకుకూరలు, కాయగూరలు,పండ్లు వినియోగించడం ద్వారా రోగాలకు దూరం కావచ్చును అన్నారు. ఈ సందర్భంగా ఆకుకూరలు,కాయగూరలు, పండ్ల ద్వారా లభించే పోషకాలను వివరించి వాటి ప్రాముఖ్యతను తెలియజేశారు. ముందు జాగ్రత్తలు పాటించడం,సమతుల ఆహారాన్ని తీసుకోవడం, వండేటప్పుడు మార్పులు చేసుకోవడం తదితర విధానాలను పాటించడం ద్వారా ఆరోగ్యకర జీవనాన్ని కొనసాగించవచ్చునని బీమాబాయి మహిళా మండలి కమిటీ ఆర్గనైజర్ డి లోవ కుమారి అన్నారు. ఈ సందర్భంగా పౌష్టికాహార ప్రాముఖ్యతను తెలియజేస్తూ ర్యాలీని నిర్వహించి, నినాదాలు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *