వార్త ముఖ్యాంశాలు
- Uploaded Video:
మండల కేంద్రమైన బిజినపల్లి విద్యుత్ సబ్స్టేషన్లో గుర్తుతెలియని వ్యక్తులు చెత్తకు నిప్పు పెట్టడంతో మంటలు అంటుకున్నాయి. ప్రమాదాన్ని పసిగట్టిన స్థానిక ప్రజలు వెంటనే ఎస్ఐ శంషాద్దీన్కు ఫోన్ ద్వారా సమాచారం చేరవేశారు. అలర్ట్ అయిన ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. సబ్స్టేషన్ లోపలికి మంటలు వ్యాపించకుండా సకాలంలో అదుపు చేయడంతో విద్యుత్ శాఖ అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అప్రమత్తంగా వ్యవహరించిన ఎస్ఐ శంషాద్దీన్ను పలువురు ప్రశంసించారు.
Uploaded Video: