Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

బాసరలో 37 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బాసరలో 37 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

వార్త ముఖ్యాంశాలు

  • బాసర: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 37 మంది లబ్ధిదారులకు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ చెక్కులను పంపిణీ చేశారు.
  • ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద కుటుంబాల్లోని ఆడబిడ్డల వివాహాలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు.
  • ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే కుటుంబాలకు ఈ పథకాలు అండగా నిలుస్తూ, వివాహ ఖర్చుల భారాన్ని తగ్గిస్తున్నాయని పేర్కొన్నారు.

బాసర: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 37 మంది లబ్ధిదారులకు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద కుటుంబాల్లోని ఆడబిడ్డల వివాహాలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే కుటుంబాలకు ఈ పథకాలు అండగా నిలుస్తూ, వివాహ ఖర్చుల భారాన్ని తగ్గిస్తున్నాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో బాసర మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, బీజేపీ నాయకులు, తహసీల్దార్, రెవెన్యూ కార్యాలయ సిబ్బంది, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *