Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
చిత్తూరు

బాల త్రిపుర సుందరిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బాల త్రిపుర సుందరిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ

**బాల త్రిపుర సుందరిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ**

ఘనంగా శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభం**

*పలమనేరు, అక్టోబర్ 11 ( పున్నమి ప్రతినిధి ) :*
పలమనేరు పట్టణంలోని శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయ ప్రాంగణంలో మొదటిసారి ఏర్పాటు చేసిన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు దుర్గమ్మ అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో వేద పండితులు ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల వితరణ చేపట్టారు. పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు కుట్టి, శివాలయం చైర్మన్ మురళీకృష్ణ, వైస్ చైర్మన్ మంజునాథ్,సుధాకర్, సుదర్శన్, బాలాజీ, సుబ్రహ్మణ్యం, గణేష్, మూర్తి, జగ్గా, యువరాజ్, నాగేంద్ర, విజయ్ శేఖర్, రాజేష్, చెంగప్ప, రెడ్డప్ప, లోకేష్, బాబు తదితరులు పాల్గొన్నారు.

బాల త్రిపుర సుందరిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ

బాల త్రిపుర సుందరిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ

బాల త్రిపుర సుందరిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *