Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

బస్సు కార్పొరేషన్ ఆధ్వర్యంలో డ్రైవర్ శిక్షణ – ఆర్టీసీ బస్సులో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బస్సు కార్పొరేషన్ ఆధ్వర్యంలో డ్రైవర్ శిక్షణ – ఆర్టీసీ బస్సులో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

అనకాపల్లి జిల్లా ఏప్రిల్ 14 : బస్సు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన అభ్యర్థులకు డ్రైవర్లుగా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎలమంచిలి కోర్ట్‌ వద్ద అంబేద్కర్ గురుకులాల్లో నిర్వహిస్తున్న వేదికల్లో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఆకస్మికంగా పరిశీలించారు.
శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులను బస్సులో జిల్లా కలెక్టర్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు స్వయంగా ప్రయాణించి వారి నైపుణ్యాలను పరిశీలించారు. డ్రైవింగ్ విధానం, నియమ నిబంధనలు పాటించడం వంటి అంశాలపై సూచనలు చేశారు.
ఈ కార్యక్రమం యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు.

బస్సు కార్పొరేషన్ ఆధ్వర్యంలో డ్రైవర్ శిక్షణ – ఆర్టీసీ బస్సులో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *