Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

బలిజ వీధిలో ప్రజా సమస్యలపై ముక్కా వరలక్ష్మి ఆరా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బలిజ వీధిలో ప్రజా సమస్యలపై ముక్కా వరలక్ష్మి ఆరా

రైల్వే కోడూరు టౌన్‌లోని బలిజ వీధిలో నిర్వహించిన సంక్షేమ పథకాల డోర్‌ టు డోర్‌ కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్‌చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను తెలియజేశారు. పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బలిజ వీధి ప్రజలు తమకు ఎదురవుతున్న పలు సమస్యలను ముక్కా వరలక్ష్మి దృష్టికి తీసుకువచ్చారు. స్థానికంగా ఉన్న సమస్యలను పరిశీలించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకోవడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు స్థానికంగా ఎదురవుతున్న సమస్యలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, స్థానికులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

బలిజ వీధిలో ప్రజా సమస్యలపై ముక్కా వరలక్ష్మి ఆరా

బలిజ వీధిలో ప్రజా సమస్యలపై ముక్కా వరలక్ష్మి ఆరా

బలిజ వీధిలో ప్రజా సమస్యలపై ముక్కా వరలక్ష్మి ఆరా

బలిజ వీధిలో ప్రజా సమస్యలపై ముక్కా వరలక్ష్మి ఆరా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *