Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

బదిలీపై వెళ్తున్న సిఐ దామోదర్ రెడ్డిని సన్మానించిన సిపిఎం నాయకులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బదిలీపై వెళ్తున్న సిఐ దామోదర్ రెడ్డిని సన్మానించిన సిపిఎం నాయకులు

వార్త ముఖ్యాంశాలు

  • జనగామ, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) జనగామ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా 15 నెలలపాటు సేవలందించిన సిఐ దామోదర్ రెడ్డి బదిలీపై వెళ్తుండగా సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఆయనను శాలువాతో సన్మానించారు.
  • ఈ సందర్భంగా కనకారెడ్డి మాట్లాడుతూ, షాపింగ్ మాల్ అగ్నిప్రమాదం, దుర్గమ్మ పండుగ, ట్రాఫిక్ నియంత్రణ వంటి సందర్భాల్లో సిఐ సమర్థవంతంగా వ్యవహరించారని ప్రశంసించారు.
  • గంజాయి, డ్రగ్స్‌ కార్యకలాపాలను అరికట్టి యువతను కౌన్సిలింగ్ చేయడం, వినకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవడం ద్వారా మార్పు తేవడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు.

జనగామ, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)

జనగామ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా 15 నెలలపాటు సేవలందించిన సిఐ దామోదర్ రెడ్డి బదిలీపై వెళ్తుండగా సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా కనకారెడ్డి మాట్లాడుతూ, షాపింగ్ మాల్ అగ్నిప్రమాదం, దుర్గమ్మ పండుగ, ట్రాఫిక్ నియంత్రణ వంటి సందర్భాల్లో సిఐ సమర్థవంతంగా వ్యవహరించారని ప్రశంసించారు. గంజాయి, డ్రగ్స్‌ కార్యకలాపాలను అరికట్టి యువతను కౌన్సిలింగ్ చేయడం, వినకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవడం ద్వారా మార్పు తేవడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. దొంగతనాల్లో రికవరీ చేసి బాధితులకు ఆస్తులు చేరేలా కృషి చేశారని వివరించారు. కార్యక్రమంలో బొట్ల శేఖర్, బూడిది గోపి, సుంచు విజేందర్, పొత్కనూరి ఉపేందర్, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు బానోతు ధర్మ బిక్షం తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *