Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

ఫుట్‌పాత్‌పై వ్యాపారం..పొంచి ఉన్న పెను ప్రమాదం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

సిద్ధవటం మండలంలోని మాధవరం-1 గ్రామ పరిధిలో కడప–చెన్నై జాతీయ రహదారి పక్కన ఉన్న ఫుట్‌పాత్‌పై కొందరు దుకాణదారులు వ్యాపారాలు నిర్వహిస్తుండటంతో ప్రమాదాల ముప్పు పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైవేపై నిత్యం వందలాది వాహనాలు వేగంగా రాకపోకలు సాగిస్తుంటాయి. ఫుట్‌పాత్‌ను దుకాణాల కోసం వినియోగించడంతో పాదచారులు రహదారిపై నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని చెబుతున్నారు.దీంతో వాహనాలు, పాదచారుల మధ్య ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రద్దీ సమయాల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని పేర్కొంటున్నారు. ఫుట్‌పాత్‌పై దుకాణాలు ఏర్పాటు చేయవద్దని పోలీసులు పలుమార్లు హెచ్చరించినప్పటికీ కొందరు దుకాణదారులు యథావిధిగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారని స్థానికులు తెలిపారు.హైవే పక్కన ఫుట్‌పాత్ ఆక్రమణల వల్ల భవిష్యత్తులో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి దుకాణాలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ఫుట్‌పాత్‌ను పాదచారుల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావడంతో పాటు తరచూ తనిఖీలు చేపట్టి ఆక్రమణలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఈ విషయమై ఇన్‌చార్జి పంచాయతీ కార్యదర్శి నాన్సీని వివరణ కోరగా.. ఫుట్‌పాత్‌పై దుకాణాలు ఏర్పాటు చేసిన యజమానులకు వాటిని తొలగించాలని ఆదేశాలు ఇస్తామని తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా ఫుట్‌పాత్‌లను ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఫుట్‌పాత్‌పై వ్యాపారం..పొంచి ఉన్న పెను ప్రమాదం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *