Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

ఎన్నికల సంఘంలో సంస్కరణలు తీసుకురావాలి కేంద్ర ఎన్నికల సంఘానికి స్వతంత్రత, విశ్వసనీయత అవసరం: తులసిరెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఎన్నికల సంఘంలో సంస్కరణలు తీసుకురావాలి కేంద్ర ఎన్నికల సంఘానికి స్వతంత్రత, విశ్వసనీయత అవసరం: తులసిరెడ్డి

ఎన్నికల సంఘంలో సంస్కరణలు తీసుకురావాలి

కేంద్ర ఎన్నికల సంఘానికి స్వతంత్రత, విశ్వసనీయత అవసరం: తులసిరెడ్డి

పున్నమి ప్రతినిధి
సెప్టెంబర్ 25, కడప

కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం ప్రభావంలో పనిచేస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి ఆరోపించారు. ఎన్నికల సంఘంలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

కడపలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన తులసిరెడ్డి.. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే ఎన్నికల సంఘానికి స్వతంత్రత, విశ్వసనీయత ఉండాలని అన్నారు.

ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని, లేకపోతే కేంద్ర ప్రభుత్వమే ఆయనతో రాజీనామా చేయించాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. కొత్త ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో కూడా మార్పులు చేయాలని సూచించారు. ప్రధానమంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నేతతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఎంపిక కమిటీలో చేర్చాలని అన్నారు.

రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గతంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ నిర్ణయించినట్లు తులసిరెడ్డి తెలిపారు.

ఎన్నికల సంఘంలో సంస్కరణలు తీసుకురావాలి కేంద్ర ఎన్నికల సంఘానికి స్వతంత్రత, విశ్వసనీయత అవసరం: తులసిరెడ్డి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *