Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
యాదాద్రి భువనగిరి

ప్రెస్ ఫోటోగ్రాఫర్ మహ్మద్ జాకీర్ హుస్సేన్‌కు ఘన సన్మానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రెస్ ఫోటోగ్రాఫర్ మహ్మద్ జాకీర్ హుస్సేన్‌కు ఘన సన్మానం

వార్త ముఖ్యాంశాలు

  • భువనగిరి పట్టణంలో మైనారిటీ జర్నలిస్ట్ ఫ్రంట్ (MJF) ఆధ్వర్యంలో ప్రముఖ ప్రెస్ ఫోటోగ్రాఫర్ మహ్మద్ జాకీర్ హుస్సేన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనను ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
  • ​ఈ సందర్భంగా మైనారిటీ జర్నలిస్ట్ ఫ్రంట్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు మహ్మద్ షుజాఉద్దీన్ మాట్లాడుతూ..
  • ప్రెస్ ఫోటోగ్రాఫర్ మహ్మద్ జాకీర్ హుస్సేన్ జర్నలిజం రంగంలో ఫోటోగ్రాఫర్‌గా విశిష్ట సేవలు అందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారని కొనియాడారు.

భువనగిరి పట్టణంలో మైనారిటీ జర్నలిస్ట్ ఫ్రంట్ (MJF) ఆధ్వర్యంలో ప్రముఖ ప్రెస్ ఫోటోగ్రాఫర్ మహ్మద్ జాకీర్ హుస్సేన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనను ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
​ఈ సందర్భంగా మైనారిటీ జర్నలిస్ట్ ఫ్రంట్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు మహ్మద్ షుజాఉద్దీన్ మాట్లాడుతూ.. ప్రెస్ ఫోటోగ్రాఫర్ మహ్మద్ జాకీర్ హుస్సేన్ జర్నలిజం రంగంలో ఫోటోగ్రాఫర్‌గా విశిష్ట సేవలు అందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారని కొనియాడారు. జాకీర్ హుస్సేన్ తన వృత్తిపరమైన సేవల ద్వారా జర్నలిజం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఆయన క్లిక్ చేసిన అద్భుతమైన ఛాయాచిత్రాలు (ఫోటోలు) జిల్లాలోని జర్నలిస్టులందరికీ ఎంతో ఉపయోగపడుతున్నాయని షుజాఉద్దీన్ పేర్కొన్నారు.
​ఈ కార్యక్రమంలో మైనారిటీ జర్నలిస్ట్ ఫ్రంట్ జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ షేక్ హమీద్ పాష, గౌరవ సలహాదారుడు ఇబ్రహీం బియబాని, ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ రషీద్,జర్నలిస్ట్ ఇంతియాజ్, తదితరులు పాల్గొన్నారు,

Leave a comment

Your email address will not be published. Required fields are marked *