వార్త ముఖ్యాంశాలు
- *ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అనువైన స్థలాల పరిశీలన**ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, ఆర్డీవో బాలకృష్ణ క్షేత్రస్థాయి తనిఖీ* నరసరావుపేట, అక్టోబర్ 05నరసరావుపేట పట్టణ పరిధిలోని పలు ప్రభుత్వ ఖాళీ స్థలాలను వివిధ ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి, ప్రజోపయోగ సేవలకు ఏ విధంగా వినియోగించవచ్చనే అంశంపై నరసరావుపేట శాసనసభ్యులు,…
- ఈ కార్యక్రమంలో పలు శాఖల ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- పట్టణంలో ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యేలా, పరిపాలనా సౌలభ్యం కోసం నూతన కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలాల లభ్యతను అధికారులు ఎమ్మెల్యే కి వివరించారు.ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమణలకు గురికాకుండా కాపాడటంతో పాటు, ప్రజలకు అనుకూలమైన ప్రాంతాల్లో అవసరమైన కార్యాలయాలు, భవనాలు నిర్మించే ప్రణాళికలపై…
*ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అనువైన స్థలాల పరిశీలన**ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, ఆర్డీవో బాలకృష్ణ క్షేత్రస్థాయి తనిఖీ*
నరసరావుపేట, అక్టోబర్ 05నరసరావుపేట పట్టణ పరిధిలోని పలు ప్రభుత్వ ఖాళీ స్థలాలను వివిధ ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి, ప్రజోపయోగ సేవలకు ఏ విధంగా వినియోగించవచ్చనే అంశంపై నరసరావుపేట శాసనసభ్యులు, స్థానిక ఆర్డీవో బాలకృష్ణ గారు క్షేత్రస్థాయిలో సంయుక్తంగా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో పలు శాఖల ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణంలో ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యేలా, పరిపాలనా సౌలభ్యం కోసం నూతన కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలాల లభ్యతను అధికారులు ఎమ్మెల్యే కి వివరించారు.ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమణలకు గురికాకుండా కాపాడటంతో పాటు, ప్రజలకు అనుకూలమైన ప్రాంతాల్లో అవసరమైన కార్యాలయాలు, భవనాలు నిర్మించే ప్రణాళికలపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ ప్రజా పరిపాలన సులభతరం చేసేందుకు, ప్రజలకు అన్ని సేవలు ఒకే చోట అందుబాటులో ఉండేలా ప్రభుత్వ స్థలాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడమే తమ లక్ష్యమని తెలిపారు. స్థలాల సర్వే పూర్తి చేసి, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు వీలుగా త్వరితగతిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్డీవో మరియు సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
