వార్త ముఖ్యాంశాలు
- Palnadu జిల్లా లోని చిలకలూరిపేట, నరసరావుపేట మున్సిపాలిటీలను ఎస్సీలకు రిజర్వ్ చేయాలని ఎమ్మార్పీఎస్ (MRPS) రాష్ట్ర అధికార ప్రతినిధి కోట సుబ్బు మాదిగ డిమాండ్ చేశారు.
- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మాన్యశ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి షాలేం రాజు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ (PGRS) కార్యక్రమంలో ఆయన కలెక్టర్‌ను కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
- ఈ మున్సిపాలిటీల ఎస్సీ రిజర్వేషన్ల అంశాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ప్రధానంగా కోరారు.ఈ సందర్భంగా కోట సుబ్బు మాదిగ మాట్లాడుతూ మున్సిపాలిటీల అభివృద్ధిలో ఎస్సీలు భాగస్వాములుగా ఉన్నారని, ఇంటి పన్ను, ఆస్తి పన్ను నుంచి నీటి పన్ను వరకు క్రమం తప్పకుండా…
Palnadu జిల్లా లోని చిలకలూరిపేట, నరసరావుపేట మున్సిపాలిటీలను ఎస్సీలకు రిజర్వ్ చేయాలని ఎమ్మార్పీఎస్ (MRPS) రాష్ట్ర అధికార ప్రతినిధి కోట సుబ్బు మాదిగ డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మాన్యశ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి షాలేం రాజు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ (PGRS) కార్యక్రమంలో ఆయన కలెక్టర్‌ను కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ మున్సిపాలిటీల ఎస్సీ రిజర్వేషన్ల అంశాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ప్రధానంగా కోరారు.ఈ సందర్భంగా కోట సుబ్బు మాదిగ మాట్లాడుతూ మున్సిపాలిటీల అభివృద్ధిలో ఎస్సీలు భాగస్వాములుగా ఉన్నారని, ఇంటి పన్ను, ఆస్తి పన్ను నుంచి నీటి పన్ను వరకు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారని గుర్తుచేశారు. అయితే, పాలక, ప్రతిపక్ష పార్టీలు తమను కేవలం పన్నులు కట్టే పౌరులుగానే మిగిల్చాయని, ఇప్పటికీ దళితులను అంటరానివారిగానే చూస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చిలకలూరిపేట మున్సిపాలిటీలో ఇప్పటికే ఓసీ, బీసీ, మైనార్టీ, ఎస్టీ సామాజిక వర్గాలకు అవకాశం దక్కిందని, ఇక మిగిలిన ఎస్సీలకు కచ్చితంగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా, నరసరావుపేట మున్సిపాలిటీలో ప్రధానంగా నాలుగు సామాజిక వర్గాలు మెజారిటీగా ఉన్నప్పటికీ, ఎస్సీలకు ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వకపోవడం వెనుక ఉన్న ఆంతర్యాన్ని రాజకీయ పార్టీలు బయటపెట్టాలని ఆయన ప్రశ్నించారు. ఈ రెండు నియోజకవర్గాల్లో మున్సిపల్ రిజర్వేషన్ల విషయంలో ఎస్సీలకు న్యాయం చేయకపోతే.. దళిత వాడల నుంచి తీవ్ర స్థాయిలో నిరసన సెగలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షులు గుండాల నగేష్, నరసరావుపేట నియోజకవర్గ అధ్యక్షులు దేవదానం మాదిగ, నరసరావుపేట మండల అధ్యక్షులు వేశపోగు తిమోతి మాదిగ, రొంపిచర్ల మండల అధ్యక్షులు రేలంగి శ్యాంబాబు మాదిగ, ఈపూరు మండల అధ్యక్షులు మరియాదాసు మాదిగ, వినుకొండ ఇంచార్జ్, సీనియర్ నాయకులు పచ్చిగోళ్ళ సుధాకర్ మాదిగ, పట్టణ అధ్యక్షులు వేల్పుల రాంబాబు మాదిగ, మహిళా నాయకురాలు రేపూడి శాంత కుమారి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
