Friday, 4 September 2026
  • Home  
  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు మెరుగుపరచాలి: AIYF
- BHADRADRI

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు మెరుగుపరచాలి: AIYF

భద్రాద్రి కొత్తగూడెం , 04/09/2026 (పున్నమి ప్రతినిధి) కొత్తగూడెం: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని AIYF జిల్లా కార్యదర్శి Sk. ఫహీమ్ దాదా డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (GGH)ను AIYF బృందం సందర్శించి రోగుల సమస్యలను పరిశీలించింది.ఈ సందర్భంగా ఫహీమ్ దాదా మాట్లాడుతూ, పేద ప్రజలు నమ్ముకునే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. తాగునీరు, పారిశుధ్యం, మరుగుదొడ్ల వసతులు మెరుగుపరచాలని, ఉచిత ల్యాబ్ పరీక్షలు, మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేసి, అత్యవసర వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఖయ్యూం, రవికిరణ్, జావిద్, రసూల్ తదితరులు పాల్గొన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం , 04/09/2026 (పున్నమి ప్రతినిధి)
కొత్తగూడెం: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని AIYF జిల్లా కార్యదర్శి Sk. ఫహీమ్ దాదా డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (GGH)ను AIYF బృందం సందర్శించి రోగుల సమస్యలను పరిశీలించింది.ఈ సందర్భంగా ఫహీమ్ దాదా మాట్లాడుతూ, పేద ప్రజలు నమ్ముకునే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. తాగునీరు, పారిశుధ్యం, మరుగుదొడ్ల వసతులు మెరుగుపరచాలని, ఉచిత ల్యాబ్ పరీక్షలు, మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేసి, అత్యవసర వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఖయ్యూం, రవికిరణ్, జావిద్, రసూల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.