Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

ప్రభుత్వ ఆసుపత్రిలో సిటి స్కాన్ పునరుద్ధరణ ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మల్ శాఖ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రభుత్వ ఆసుపత్రిలో సిటి స్కాన్ పునరుద్ధరణ ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మల్ శాఖ

వార్త ముఖ్యాంశాలు

  • పత్రికా ప్రకటన (Press Note) తేదీ: 21 ఆగస్టు 2026 ప్రదేశం: నిర్మల్ హెచ్.ఆర్.సి (TG.H.R.C) ఆదేశాల ఫలితం: నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పునరుద్ధరించబడిన CT స్కాన్ సేవలు * పేద రోగులకు అందుబాటులోకి వచ్చిన ఉచిత వైద్య సేవలు * ప్రత్యక్షంగా పరిశీలించిన ఆమ్ ఆద్మీ…
  • తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TG.H.R.C) జారీ చేసిన సంచలన ఉత్తర్వుల నేపథ్యంలో, ఆసుపత్రి యాజమాన్యం తక్షణమే స్పందించి CT స్కాన్ యంత్రానికి రిపేర్లు పూర్తి చేయించి సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
  • ఈ సందర్భంగా ఈరోజు (21-08-2026) ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ సయ్యద్ హైదర్ నేతృత్వంలో పార్టీ ప్రతినిధి బృందం ఆసుపత్రిలోని CT స్కాన్ కేంద్రాన్ని నేరుగా సందర్శించి ಪರಿಶీలించింది.

పత్రికా ప్రకటన (Press Note)
తేదీ: 21 ఆగస్టు 2026
ప్రదేశం: నిర్మల్
హెచ్.ఆర్.సి (TG.H.R.C) ఆదేశాల ఫలితం: నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పునరుద్ధరించబడిన CT స్కాన్ సేవలు
* పేద రోగులకు అందుబాటులోకి వచ్చిన ఉచిత వైద్య సేవలు
* ప్రత్యక్షంగా పరిశీలించిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు
నిర్మల్ జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లో గత ఏడాది కాలంగా నిలిచిపోయిన CT స్కాన్ సేవలు ఎట్టకేలకు పునరుద్ధరించబడ్డాయి. తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TG.H.R.C) జారీ చేసిన సంచలన ఉత్తర్వుల నేపథ్యంలో, ఆసుపత్రి యాజమాన్యం తక్షణమే స్పందించి CT స్కాన్ యంత్రానికి రిపేర్లు పూర్తి చేయించి సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ సందర్భంగా ఈరోజు (21-08-2026) ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ సయ్యద్ హైదర్ నేతృత్వంలో పార్టీ ప్రతినిధి బృందం ఆసుపత్రిలోని CT స్కాన్ కేంద్రాన్ని నేరుగా సందర్శించి ಪರಿಶీలించింది. ఈ క్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు RMO డాక్టర్ రమేష్ గార్లతో సమావేశమై మాట్లాడగా, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆదేశాల మేరకు CT స్కాన్ యంత్రాన్ని పూర్తిస్థాయిలో రిపేర్ చేయించి, ప్రజలకు సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అధికారులు ధృవీకరించారు.
ఈ సందర్భంగా సయ్యద్ హైదర్ మాట్లాడుతూ:
“నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం వందలాది మంది పేద రోగులు వస్తుంటారు. అత్యంత కీలకమైన CT స్కాన్ యంత్రం పనిచేయకపోవడం వల్ల పేద ప్రజలు ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లలో వేల రూపాయలు ఖర్చు చేస్తూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానిక అధికారులు, డీఎంఈ మరియు కలెక్టర్‌కు విన్నవించినా ఫలితం లేకపోవడంతో మేము TG.H.R.Cని (HRC No. 2767/2026) ఆశ్రయించాము.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ‘ఆరోగ్య హక్కు’ ప్రాథమిక హక్కు అని స్పష్టం చేస్తూ, గౌరవ కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ గారు జారీ చేసిన ఆదేశాల ఫలితంగానే ఈరోజు పేద రోగులకు ఉచిత CT స్కాన్ సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. ఇది నిర్మల్ ప్రజల విజయం.”
అలాగే, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారంతా నిరుపేదలే కాబట్టి CT స్కాన్, X-Ray మరియు ఇతర అత్యవసర వైద్య పరీక్షల యంత్రాలు ఎల్లప్పుడూ నిరంతరాయంగా పనిచేసేలా ఆసుపత్రి యాజమాన్యం ముందస్తు జాగ్రత్తలు వహించాలని, ప్రజలకు ఎల్లప్పుడూ మెరుగైన వైద్యం అందించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మల్ జిల్లా జనరల్ సెక్రెటరీ సి.హెచ్. వినోద్ కుమార్, జిల్లా ట్రెజరర్ అబ్దుల్ సాదిక్, నాయకులు షేక్ షారూఖ్, అబ్దుల్ సాజిద్ తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు,
సయ్యద్ హైదర్
రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ,
ఆమ్ ఆద్మీ పార్టీ, తెలంగాణ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *