Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

ప్రత్యేక అధికారిగా సురేష్‌కుమార్‌ బాధ్యతల స్వీకరణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ప్రత్యేక అధికారిగా సురేష్‌కుమార్‌ బాధ్యతల స్వీకరణ

వార్త ముఖ్యాంశాలు

  • - ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం - గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి పనులపై దృష్టి ఓబులవారిపల్లి: మండల పరిషత్‌ ప్రత్యేక అధికారిగా సురేష్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు.
  • మండల పరిషత్‌ అధ్యక్షుడి పదవీకాలం ఈనెల 23వ తేదీతో ముగియడంతో జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వుల మేరకు ఆయనకు ప్రత్యేక అధికారిగా బాధ్యతలు అప్పగించారు.
  • ఈ మేరకు సోమవారం సంబంధిత అధికారుల సమక్షంలో బాధ్యతలు చేపట్టారు.

– ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

– గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి పనులపై దృష్టి

ఓబులవారిపల్లి: మండల పరిషత్‌ ప్రత్యేక అధికారిగా సురేష్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. మండల పరిషత్‌ అధ్యక్షుడి పదవీకాలం ఈనెల 23వ తేదీతో ముగియడంతో జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వుల మేరకు ఆయనకు ప్రత్యేక అధికారిగా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు సోమవారం సంబంధిత అధికారుల సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ మండల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటామని చెప్పారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా, డ్రైనేజీ, పారిశుద్ధ్యం తదితర మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు సక్రమంగా అందేలా అధికారులతో సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి ఎంవీఎన్‌ రాజేంద్ర, ఈవోపీఆర్డీ రామ్మోహన్‌రెడ్డి, ఏఈ ఆంజనేయ ప్రసాద్‌, పంచాయతీరాజ్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *