Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబ్ నగర్

ప్రతి వ్యక్తి జీవితంలో నడక, వ్యాయామం ఓ భాగమైపోవాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

*ప్రతి వ్యక్తి జీవితంలో నడక… ఆరోగ్యాన్ని అందించే మొదటి సోపానం*

*పున్నమి ప్రతినిధి:: మహబూబ్నగర్ జిల్లా:: తేదీ::06/04/2026*

**సుశ్రుత ప్రజా వైద్యశాల మహబూబ్నగర్, ఇరవై అయిదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా టూకే రన్ లో ముఖ్యఅతిథిగా టీవీ నటుడు జబర్దస్త్ రాంప్రసాద్ గారు మరియు సుశ్రుత ప్రజా వైద్యశాల యజమాన్యం డాక్టర్ మధుసూదన్ రెడ్డి మరియు డాక్టర్ ప్రతిభ మేడం వారి సిబ్బంది ఆర్గనైజర్లు వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు స్థానిక పట్టణానికి చెందిన డాక్టర్లు, అధికారులు, అనధికారులు శ్రేయోభిలాషులు, మిత్రులు, అందరూ న్యూటౌన్ యందు ఉన్న సుశ్రుత ప్రజా వైద్యశాల నుంచి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు టూకే రన్ నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా జబర్దస్త్ రాంప్రసాద్ మాట్లాడుతూ నేడు ఆధునిక యుగంలో ప్రతి వ్యక్తి కనీసం అర్థ గంట నడవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది అప్పుడే వారి జీవితానికి జీవితంలో అనేక వ్యాధుల నుండి ఉపశమనం పొందేందుకు వీలుంటుందని, ఆరోగ్యవంతంగా జీవించగలుగుతాడని తెలిపారు.స్థానిక ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి మరియు మేయర్ మమత తోపాటు రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎంఎన్ విజయకుమార్ పాల్గొన్నారు*

ప్రతి వ్యక్తి జీవితంలో నడక, వ్యాయామం ఓ భాగమైపోవాలి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *