Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

ప్రతి కార్యకర్తకు న్యాయం చేయడమే నా లక్ష్యం…. ఎమ్మెల్యే బొజ్జల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రతి కార్యకర్తకు న్యాయం చేయడమే నా లక్ష్యం…. ఎమ్మెల్యే బొజ్జల

వార్త ముఖ్యాంశాలు

  • పార్టీ ని నమ్ముకున్న ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేయడమే నా లక్ష్యం అని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు.
  • స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం శ్రీకాళహస్తి, ఏర్పేడు, రేణిగుంట మండల , గ్రామ, వార్డు అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్ ఇన్చార్టులు, బూత్ లెవెల్ ఏజెంట్ల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.
  • అనంతరం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం చేసిన నాయకులు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

పార్టీ ని నమ్ముకున్న ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేయడమే నా లక్ష్యం అని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం శ్రీకాళహస్తి, ఏర్పేడు, రేణిగుంట మండల , గ్రామ, వార్డు అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్ ఇన్చార్టులు, బూత్ లెవెల్ ఏజెంట్ల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం చేసిన నాయకులు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి కార్యకర్తకు న్యాయం చేయడం, పార్టీని బలోపేతం చేయడం తన లక్ష్యమని, కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ గుర్తింపు లభించేలా బాధ్యతలు కేటాయించామని, అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించామని ఆయన స్పష్టం చేశారు. పదవి చిన్నదా, పెద్దదా అన్నది కాదని, బాధ్యతలతో పనిచేసే ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఇవ్వడమే ధ్యేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *