Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

ప్రజా సమస్యలకు మండల కేంద్రంలోనే పరిష్కారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రజా సమస్యలకు మండల కేంద్రంలోనే పరిష్కారం

వార్త ముఖ్యాంశాలు

  • తాళ్లపూడి, పున్నమి ప్రతినిధి, మే 24: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘స్పందన’ కార్యక్రమాన్ని ప్రతి సోమవారం మండల రెవెన్యూ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు తాళ్లపూడి ఎమ్మార్వో లక్ష్మీ లావణ్య తెలిపారు.
  • శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
  • ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ తాళ్లపూడి మండల ప్రజలు తమ సమస్యలను జిల్లా కలెక్టరేట్‌లో తెలియజేయడానికి సుమారు 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

తాళ్లపూడి, పున్నమి ప్రతినిధి, మే 24: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘స్పందన’ కార్యక్రమాన్ని ప్రతి సోమవారం మండల రెవెన్యూ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు తాళ్లపూడి ఎమ్మార్వో లక్ష్మీ లావణ్య తెలిపారు. శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ తాళ్లపూడి మండల ప్రజలు తమ సమస్యలను జిల్లా కలెక్టరేట్‌లో తెలియజేయడానికి సుమారు 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇకపై ప్రజలు కలెక్టరేట్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలోనే పిజిఆర్ఎస్ వినతులను స్వీకరిస్తామని స్పష్టం చేశారు.
ప్రతి సోమవారం స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమంలోనే పింఛన్లు, రేషన్ కార్డులు, భూ సమస్యలు, ఆదాయ, నివాస ధృవపత్రాలు, ఇళ్ల స్థలాలు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ తదితర ప్రజా సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను అందజేయవచ్చని తెలిపారు.
ప్రతి సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్పందన కార్యక్రమం నిర్వహించబడుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మార్వో కోరారు. వచ్చే సోమవారం నుంచే ఈ సౌకర్యం అమల్లోకి వస్తుందని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *