Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

ప్రజల విజ్ఞప్తికి ఫలితం.. సిద్ధార్థ నగర్‌లో సామాజిక భవనం ప్రారంభం రూ.50 లక్షల జీవీఎంసీ నిధులతో నిర్మాణం పూర్త

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రజల విజ్ఞప్తికి ఫలితం.. సిద్ధార్థ నగర్‌లో సామాజిక భవనం ప్రారంభం రూ.50 లక్షల జీవీఎంసీ నిధులతో నిర్మాణం పూర్త

విశాఖపట్నం (పున్నమి ప్రతినిధి): గాజువాక నియోజకవర్గం 87వ వార్డు పరిధిలోని సిద్ధార్థ నగర్‌లో నూతనంగా నిర్మించిన సామాజిక భవనాన్ని మాజీ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాథం (జగన్) ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ సిద్ధార్థ నగర్‌లోని మధ్యతరగతి కుటుంబాలు చిన్నచిన్న శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్థానిక అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు ప్రజల అవసరాలను గుర్తించి జీవీఎంసీ ద్వారా సుమారు రూ.50 లక్షల నిధులు మంజూరు చేయించి భవన నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తోందని అన్నారు.

ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు విజయరామరాజు, కార్యదర్శి బొట్టా ప్రకాష్, మాజీ కార్పొరేటర్ గొర్లె వెంకీ నాయుడు, బీజేపీ జిల్లా కార్యదర్శి లక్కరాజు సోమరాజు, బెల్లంకొండ రాజన్ రాజు, కల్లేపల్లి శ్రీనివాస్ వర్మ, కండ్రిగుల శ్రీనివాస్ నాయుడు, దీప్తి, వర్రె రాంబాబు, పావాడ వెంకటరమణమూర్తి, పాల్తేరు పెంటయ్య, కణితి ఈశ్వరరావు, వై. భాస్కరరావు, పోతల కృష్ణ, కడుపుట్ల శ్రీను, జాన్ రమేష్, ఆదినారాయణ, దాలయ్య, బల్రెడ్డి నాగేశ్వరరావు, సూరిబాబు, నాగేష్, కోగంటి లెనిన్ బాబుతో పాటు సిద్ధార్థ నగర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

ప్రజల విజ్ఞప్తికి ఫలితం.. సిద్ధార్థ నగర్‌లో సామాజిక భవనం ప్రారంభం రూ.50 లక్షల జీవీఎంసీ నిధులతో నిర్మాణం పూర్త

ప్రజల విజ్ఞప్తికి ఫలితం.. సిద్ధార్థ నగర్‌లో సామాజిక భవనం ప్రారంభం రూ.50 లక్షల జీవీఎంసీ నిధులతో నిర్మాణం పూర్త

ప్రజల విజ్ఞప్తికి ఫలితం.. సిద్ధార్థ నగర్‌లో సామాజిక భవనం ప్రారంభం రూ.50 లక్షల జీవీఎంసీ నిధులతో నిర్మాణం పూర్త

Leave a comment

Your email address will not be published. Required fields are marked *