Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

ప్రజల రక్షణే ప్రథమ కర్తవ్యం: “పల్లెనిద్ర” కార్యక్రమంతో గ్రామ ప్రజల భద్రతకు భరోసా.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రజల రక్షణే ప్రథమ కర్తవ్యం: “పల్లెనిద్ర” కార్యక్రమంతో గ్రామ ప్రజల భద్రతకు భరోసా.

వార్త ముఖ్యాంశాలు

  • డా.
  • శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మెజిస్ట్రేట్ గారి ఆదేశాల మేరకు ప్రజలతో మమేకమై క్షేత్రస్థాయిలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడం లక్ష్యంగా ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
  • ఇందులో భాగంగా పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోరపల్లి గ్రామం, పద్మనాభం పోలీస్ స్టేషన్ పరిధిలోని తాళ్లవలస గ్రామంలో పోలీస్ అధికారులు, సిబ్బంది రాత్రి బస చేశారు.

డా. శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మెజిస్ట్రేట్ గారి ఆదేశాల మేరకు ప్రజలతో మమేకమై క్షేత్రస్థాయిలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడం లక్ష్యంగా ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోరపల్లి గ్రామం, పద్మనాభం పోలీస్ స్టేషన్ పరిధిలోని తాళ్లవలస గ్రామంలో పోలీస్ అధికారులు, సిబ్బంది రాత్రి బస చేశారు. గ్రామస్తులతో ముఖాముఖిగా మాట్లాడి స్థానిక సమస్యలు, శాంతిభద్రతల పరిస్థితిపై వివరాలు తెలుసుకోవడంతో పాటు గంజాయి మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ప్రజల సహకారంతో నేరాలను అరికట్టి, పోలీస్–ప్రజల మధ్య నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తూ సురక్షితమైన విశాఖ నిర్మాణానికి విశాఖ నగర పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *