Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

ప్రజల నీటి సమస్యలు తెలుసుకుంటున్న ముస్తాబాద్ గ్రామ సర్పంచ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రజల నీటి సమస్యలు తెలుసుకుంటున్న ముస్తాబాద్ గ్రామ సర్పంచ్

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి ముస్తాబాద్ 26-3-2026 ముస్తాబాద్ గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యపై సర్పంచ్ మట్ట వెంకటేష్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు.
  • గ్రామంలోని పలు వీధుల్లో పర్యటించి, నీటి సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
  • తాగునీటి కొరత తీవ్రంగా ఉందని గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

పున్నమి ప్రతినిధి ముస్తాబాద్ 26-3-2026

ముస్తాబాద్ గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యపై సర్పంచ్ మట్ట వెంకటేష్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. గ్రామంలోని పలు వీధుల్లో పర్యటించి, నీటి సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి కొరత తీవ్రంగా ఉందని గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నీటి సరఫరా వ్యవస్థను మరమ్మతు చేయించి, అవసరమైతే అదనపు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని చెప్పారు. గ్రామ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *