Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

ఏప్రిల్ 1 నుంచి ‘మన ఇసుక వాహనం’ ద్వారా ఇసుక సరఫరా – అక్రమ రవాణాపై కఠిన చర్యలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • రాజన్న సిరిసిల్ల జిల్లా మార్చి పున్నమి ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ 1 నుంచి ‘మన ఇసుక వాహనం’ ద్వారా నిర్మాణ పనులకు ఇసుక సరఫరా ప్రారంభమవుతుందని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.
  • ఇందుకోసం ఆన్లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుందని చెప్పారు.
  • ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా మార్చి పున్నమి ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ 1 నుంచి ‘మన ఇసుక వాహనం’ ద్వారా నిర్మాణ పనులకు ఇసుక సరఫరా ప్రారంభమవుతుందని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ఇందుకోసం ఆన్లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
ఐడీఓసీలో జరిగిన జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశంలో ఎస్పీ మహేష్ బి గితేతో కలిసి కలెక్టర్ ఈ నిర్ణయాలు వెల్లడించారు. కేవలం అనుమతించిన ఇసుక రీచ్‌ల నుంచే సరఫరా జరగాలని, మండల నుంచి జిల్లా స్థాయి వరకు టాస్క్‌ఫోర్స్ టీంలు ఏర్పాటు చేసి నిరంతర తనిఖీలు చేయాలని సూచించారు.
ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటుక బట్టీలు కూడా నిబంధనల ప్రకారం అనుమతులు పొందాలని స్పష్టం చేశారు. ఎస్పీ మహేష్ బి గితే మాట్లాడుతూ, అక్రమ రవాణాపై నిఘా పెంచి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *