Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

పోలీస్ అమరవీరుల త్యాగాలకు ఘన నివాళి – రక్తదాన శిబిరంలో పాల్గొన్న డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పోలీస్ అమరవీరుల త్యాగాలకు ఘన నివాళి – రక్తదాన శిబిరంలో పాల్గొన్న డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నర్సంపేట పట్టణంలోని సిటిజన్ క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ఘనంగా జరిగింది.
  • ఈ శిబిరంలో *బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారు పాల్గొన్నారు.
  • ఈ సందర్భంగా రాణా ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, యువకులు, సన్నిహితులు రక్త దానం చేయడం జరిగింది.

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నర్సంపేట పట్టణంలోని సిటిజన్ క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ఘనంగా జరిగింది. ఈ శిబిరంలో *బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాణా ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, యువకులు, సన్నిహితులు రక్త దానం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ . గోగుల రాణా ప్రతాప్ రెడ్డి* గారు మాట్లాడుతూ దేశ రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగం మరువలేనిది. వారి త్యాగాలను స్మరించుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం. రక్తదానం అనేది కేవలం సేవ మాత్రమే కాదు, ఆపదలో ఉన్న వారి ప్రాణాలను నిలబెట్టే మహత్తర మానవతా కార్యం. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలి అని పిలుపునిచ్చారు.
పోలీస్ అమరవీరుల సేవలను కొనియాడుతూ వారికి ఘన నివాళులు అర్పించారు. ఈ రక్తదాన శిబిరం ద్వారా సమాజంలో సేవాభావం, మానవతా విలువలు మరింత పెంపొందాలని ఆకాంక్షించారు.

వార్తా మూలాలు

  • Praveenపత్రికా ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *