Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

ఉప్పరపల్లి గ్రామం – చెన్నారావుపేట మండలం – వరంగల్ జిల్లా. దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉప్పరపల్లి గ్రామం – చెన్నారావుపేట మండలం – వరంగల్ జిల్లా. దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి

వార్త ముఖ్యాంశాలు

  • చెన్నరావుపేట :(పున్నమి )బిర్రు మహేందర్ మాదిగ MRPS, MSP రాష్ట్ర నాయకులు SC ST మానిటరింగ్ కమిటీ సభ్యులు స్థానిక ఉప్పరపల్లి గ్రామంలో దసరా పండుగ రోజున దళితులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ ఎమ్మెస్ పి…
  • ఈ సమావేశంలో....
  • MRPS, MSP రాష్ట్ర నాయకులు తడుగుల విజయ్ మాదిగ , MRPS వరంగల్ జిల్లా సీనియర్ నాయకులు గోలి సుధాకర్ మాదిగ, MRPS మాజీ మండల అధ్యక్షులు బొమ్మెర రవీందర్ మాదిగ, బిర్రు బిక్షపతి మాదిగ, నవీన్ల మల్లయ్య, పులి సాంబయ్య, ఎల్దొండ మల్లయ్య, బరుపట్లవీరేశం, బొమ్మెర…

చెన్నరావుపేట :(పున్నమి )బిర్రు మహేందర్ మాదిగ
MRPS, MSP రాష్ట్ర నాయకులు SC ST మానిటరింగ్ కమిటీ సభ్యులు స్థానిక ఉప్పరపల్లి గ్రామంలో దసరా పండుగ రోజున దళితులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ ఎమ్మెస్ పి ఆధ్వర్యంలో ప్రెస్మీట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం MRPS వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షులు కట్ల రాజశేఖర్ మాదిగ గారి అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథిగా బిర్రు మహేందర్ మాదిగ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి అనంతరం మాట్లాడుతూ గ్రామంలో ని ఆనవాయితీ ప్రకారం దసరా పండుగకు గ్రామ పెద్దలు అయిన కొంతమందిని డప్పు చప్పులతో ఆహ్వానిచ్చే సందర్భంలో BC సామాజిక వర్గానికి చెందిన చింత కింది అశోక్ గారి ఇంటి వద్దకు రాగానే దానిని జీర్ణించుకోలేక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 1 దొనకొండ కర్ణాకర్ రెడ్డి, 2 రెండేడ్ల శరత్ రెడ్డి, 3 భరత్ రెడ్డి మరియు 4 చింతకింది దినేష్, 5 తాటికొండ రాకేష్ వీరి ఐదుగురు కూడా డప్పులు కొట్టే బొమ్మెర కొమ్మాలు మరో ముగ్గురిని చాలా దుర్భరమైన పదజాలతో కులం పేరుతో దూషించి కొట్టుకుంటూ కింద పడేసి కాళ్ళతో తన్నడం జరిగింది ఇట్టి విషయంలో FIR అయినప్పటికీ నిందితులు అనేక రకాలుగా బాధిత కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నారు కావున అట్టి నిందితులపై తక్షణమే చర్యలు తీసుకొని అరెస్టు చేయాలని అంతేగాక గ్రామంలో అనేక విషయాలపై కులవివక్షత కొనసాగుతుందని ఇట్టి విషయంపై స్థానిక MLA దొంతి మాధవ రెడ్డి గారు తక్షణమే స్పందించాలని అంతేకాకుండా ప్రభుత్వ అధికారులతో గ్రామంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసి భవిష్యత్తులో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చొరవ తీసుకోవాలని బాధిత కుటుంబానికి ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అండగా ఉంటారని స్పష్టం చేయడం జరిగింది.

ఈ సమావేశంలో….

MRPS, MSP రాష్ట్ర నాయకులు తడుగుల విజయ్ మాదిగ , MRPS వరంగల్ జిల్లా సీనియర్ నాయకులు గోలి సుధాకర్ మాదిగ, MRPS మాజీ మండల అధ్యక్షులు బొమ్మెర రవీందర్ మాదిగ, బిర్రు బిక్షపతి మాదిగ, నవీన్ల మల్లయ్య, పులి సాంబయ్య, ఎల్దొండ మల్లయ్య, బరుపట్లవీరేశం, బొమ్మెర సాంబయ్య, నవీన్ల పవన్, గూడెల్లి బాబు, నవీన్ల, మణికంఠ, బొమ్మెర మహేందర్, నవీన్ల ప్రవీణ్, బరుపట్ల,అఖిల్, బరుపట్ల రాజు తదితరులు పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • Praveenపత్రికా ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *