Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విజయనగరం

పెదరావుపల్లి ఎస్సీ కులానికి చెందిన 13 మంది రైతుల తోటల ధ్వంసం ప్రభుత్వానికి న్యాయం చేయాలంటూ బాధ్యతల విజ్ఞప్తి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పెదరావుపల్లి ఎస్సీ కులానికి చెందిన 13 మంది రైతుల తోటల ధ్వంసం ప్రభుత్వానికి న్యాయం చేయాలంటూ బాధ్యతల విజ్ఞప్తి

విజయనగరం జిల్లా బ్యూరో రమణ/ ఆగస్టు 15. పున్నమి ప్రతినిధి

పెదరావుపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 1/1లో సుమారు 20 ఎకరాల ప్రభుత్వ వెస్ట్ ల్యాండ్ డెవలప్‌మెంట్ భూమిని గతంలో ప్రభుత్వం తమకు కేటాయించిందని బాధిత రైతులు తెలిపారు. అప్పటి నుంచి ఆ భూమిలో జీడి, మామిడి మొక్కలు నాటి వాటిపైనే ఆధారపడి జీవనోపాధి కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.

అయితే ఎలాంటి ముందస్తు నోటీసు లేదా సమాచారం ఇవ్వకుండా క్రషర్ యజమాని జి. సుదర్శన్ రావు ఆధ్వర్యంలో జేసీబీలతో రాత్రి వేళ తమ తోటల్లోకి ప్రవేశించి జీడి, మామిడి మొక్కలను తొలగించి, భూమిని చదును చేశారని బాధితులు ఆరోపించారు.

ఈ విషయంపై ప్రశ్నించగా, “ఈ భూమికి ప్రభుత్వ మైనింగ్ అనుమతులు ఉన్నాయి. మీకు తోచింది చేసుకోండి” అంటూ బెదిరింపులకు పాల్పడ్డారని వారు వాపోయారు. తమ జీవనాధారమైన తోటలను ధ్వంసం చేయడంతో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని పెట్ల బంగారయ్యే s/అప్పలస్వామి, పెట్ల గౌరమ్మ /పోతాయ్య, పెట్ల యేసు దాసు s/లేట్ అర్జున, పెట్ల సంతమ్మ w/అప్పారావు, వంగళపూడి రాములమ్మ w/లేట్ పెంటయ్య, పెట్ల రమణమ్మ w/యర్రయ్య, పెట్ల అప్పలకొండ, w/గాంధీ, పెట్ల నరసింగ్ రావు s/ లేట్ చిన్నప్పలస్వామి, పెట్ల సొరమ్మ w/లేట్ దేముడు, పళ్లివేల గున్నమ్మ w/రమణ, పెట్ల దేముడమ్మా w/నాగరాజు, పెట్ల అప్పలకొండ w/లేట్ దేముడు, సత్తాలా సుభద్ర w/లేట్ అప్పారావు 13 మంది ఎస్సీ కుటుంబానికి చెందిన వారు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

ఈ ఘటనపై ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయడంతో పాటు జరిగిన నష్టానికి తగిన పరిహారం అందించాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు.

పెదరావుపల్లి ఎస్సీ కులానికి చెందిన 13 మంది రైతుల తోటల ధ్వంసం ప్రభుత్వానికి న్యాయం చేయాలంటూ బాధ్యతల విజ్ఞప్తి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *